Ear Cancer: క్యాన్సర్ అనేది ఒక తీవ్రమైన వ్యాధి. దీనిని సకాలంలో గుర్తించి చికిత్స చేయడం చాలా ముఖ్యం. లేదంటే ఇది ప్రాణాంతకంగా మారుతుంది. ప్రస్తుత కాలంలో తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. శరీరంలో ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు. కానీ చెవి క్యాన్సర్ కేసులు చాలా అరుదుగా కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం చాలామంది దీని లక్షణాలను సకాలంలో గుర్తించలేకపోవడం.
చెవి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను ప్రజలు గుర్తించలేరని, దీనివల్ల వ్యాధి శరీరమంతా వ్యాపిస్తుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే చెవిలో మాటిమాటికీ నొప్పి రావడం లేదా చెవి గులిమి, రంగు మారడం వంటి వాటిని తేలికగా తీసుకోకూడదు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.
Also Read: టీవీఎస్ ఎన్-టార్క్ 150.. హైపర్ స్పోర్ట్ స్కూటర్ యుగం ప్రారంభం!
చెవి క్యాన్సర్ రకాలు
బాహ్య చెవి క్యాన్సర్: ఇది సాధారణంగా చర్మ క్యాన్సర్‌గా మొదలవుతుంది. క్రమంగా ఇది చెవి లోపలి భాగాలకు వ్యాపిస్తుంది.
ఇయర్ కెనాల్ క్యాన్సర్: ఇది చెవి లోపలి గొట్టం (కెనాల్)పై కనిపిస్తుంది. కెనాల్ వెలుపలి భాగంలో గడ్డలు, ఏర్పడతాయి. దీనిని సర్జరీ ద్వారా నయం చేయవచ్చు.
మధ్య చెవి క్యాన్సర్: ఈ రకమైన క్యాన్సర్ చెవి మధ్య భాగాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది చాలా నొప్పిని కలిగిస్తుంది.
చెవి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు
- మాటిమాటికీ చెవిలో తీవ్రమైన నొప్పి రావడం.
- చెవి నుండి గులిమి ఎక్కువగా రావడం లేదా దాని రంగు మారడం క్యాన్సర్ సంకేతం కావచ్చు.
- ఒకవేళ చెవి నుండి ఎర్రటి రంగులో ద్రవం లేదా గులిమి వస్తూ దాంతో పాటు నొప్పి కూడా ఉంటే మీరు వెంటనే అప్రమత్తం కావాలి.
ఏ కారణం లేకుండా వినికిడి లోపం కలగడం.
