Site icon HashtagU Telugu

High Blood Pressure: హైబీపీ తగ్గాలి అంటే ప్రతిరోజు ఉదయం జ్యూస్ తాగాల్సిందే?

High Blood Pressure

High Blood Pressure

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో రకమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మరి ముఖ్యంగా చిన్న వయసు నుండే షుగర్, బీపీలాంటి సమస్యలను ఎదుర్కుంటున్నారు. ఈరోజుల్లో అందరినీ ఎక్కువగా చుట్టుముడుతున్న సమస్య హైబీపీ. దీనినే అధిక రక్తపోటు అని కూడా అంటారు. కానీ హై బీపీ ఉన్నవారికి బ్లడ్ ఫ్లోటింగ్ తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంటుంది. అంతేకాకుండా ఎక్కువ శాతం మంది హైబీపీ కారణంగానే మరణిస్తున్నారు. బిజీబిజీ లైఫ్‌స్టైల్‌, ఒత్తిడి, చెడు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల హైపర్‌టెన్షన్‌‌ సమస్య ఈ రోజుల్లో ఎక్కువ అయ్యింది.

చాలా సందర్భాలలో, హైపర్‌ టెన్షన్‌ పేషెంట్స్‌ ఈ సమస్యను లైట్‌గా తీసుకోవడంతో ఆందుకు సంబందించి సరైన చికిత్స కూడా తీసుకోరు. అయితే హైబీపీని నియంత్రణలో ఉంచుకోకపోతే హార్ట్‌ ఎటాక్‌, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, కిడ్నీ వ్యాధి, గర్భధారణ సమయంలో సమస్యలు, కంటి చూపు కోల్పోవడం, స్ట్రోక్‌, వాస్కులర్ డిమెన్షియా వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే హై బీపీని కంట్రోల్ లో ఉంచుకోవాలి అంటే ప్రతిరోజు ఉదయం పూట ఈ జ్యూస్ తాగితే హైబీపీ నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. మరి హైబీపీని నియంత్రణలో ఉంచుకోవడం కోసం ఎటువంటి జ్యూస్ తాగాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో బీట్‌రూట్‌ రసం తాగితే హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది.

ప్రతిరోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే సిస్టోలిక్ బ్లడ్‌ ప్రెజర్‌ 4 నుంచి 5 పాయింట్లు తగ్గుతుంది. కాగా బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్స్‌ శరీరంలోకి వెళ్లి నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. నైట్రిక్ ఆక్సైడ్‌ సహాయంతో రక్తాన్ని మోసే సిరలు రిలాక్స్‌ అవుతాయి. దీంతో హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది. అయితే బీట్‌ రూట్‌ జ్యూస్‌ను ఎప్పుడైనా తాగొచ్చు. కానీ, ఉదయం ఖాళీ కడుపుతో, బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక గంట ముందు బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగితే మంచి కనిపిస్తాయి. బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగితే హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌ అవడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల స్టామినా కూడా పెరుగుతుంది. డిమెన్షియా, అధిక బరువు, కొలెస్ట్రాల్‌, లివర్‌ సమస్యలు దూరం అవుతాయి.

Exit mobile version