Pomegranate: దానిమ్మ పండు తింటున్నారా.. అయితే ఈ ఒక్క పొరపాటు అస్సలు చేయకండి?

దానిమ్మ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాగా ప్రస్తుతం మనకు

  • Written By:
  • Updated On - February 19, 2024 / 09:19 PM IST

దానిమ్మ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాగా ప్రస్తుతం మనకు మార్కెట్లో ఈ దానిమ్మ పండ్లు ఏడాది పొడవునా లభిస్తూ ఉంటాయి. ఇది గుండె పనితీరును మెరుగుపరచడం దగ్గర నుంచి రోగనిరోధక శక్తిని పెంచే వరకు దానిమ్మ పండు మనకు చేసే మేలు అంతా కాదు. అయితే దానిమ్మ పండు తినడం మంచిదే కానీ దానిమ్మ పండు తింటున్నప్పుడు కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. మరి ఎటువంటి పొరపాటు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సహజంగా ప్రతిరోజు దానిమ్మ పండు తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అలాగే అల్సర్ ఉన్న సరే అది చాలా తొందరగా క్యూర్ అవుతుంది.

ఎవరికైతే అల్సర్ ప్రాబ్లం ఉంటుందో అటువంటి వాళ్ళు రెగ్యులర్ గా తీసుకుంటే అది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అల్సర్ క్రమ క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. నడుము నొప్పితో చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కానీ ప్రతిరోజు మీరు దానిమ్మ కాయ జ్యూస్ తీసుకొని దాంట్లో కాస్త తేనె కలుపుకొని తాగితే మీకు చాలా తొందరగా నడుము అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇక చాలామందికి డిప్రెషన్ కి లోనై ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా కంటిన్యూగా దానిమ్మకాయను తీసుకుంటే డిప్రెషన్ నుంచి మీకు చాలా ఉపశమనం అనేది కలుగుతుంది. ఎవరికైతే బాగా బ్లడ్ అనేది బాడీలో తక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళు కూడా నిత్యంగా మన దానిమ్మ కాయ జ్యూస్ కానీ దానిమ్మ గింజలు కానీ తినటం అనేది చేస్తే బ్లడ్ లో చాలా తొందరగా పెరుగుదల అనేది ఉంటుంది.

ఇప్పుడు దానిమ్మ తీసుకోవటం వలన మనకు వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనం తెలుసుకుందాం. కాని ఎవరికైతే దగ్గు ఉంటుందో అటువంటి వాళ్ళకి అస్సలా దానిమ్మ ఇవ్వనే ఇవ్వకూడదు. కంప్లీట్ గా అవట్ చేయాలి. ఎందుకంటే దగ్గు , ఆస్తమా ప్రాబ్లం ఉన్నవాళ్లకి మనం కానీ దానిమ్మకాయలు ఇస్తే వాళ్ళకి అది ఇంకా రెట్టింపు పెరుగుతుంది. కానీ వారికి ఎటువంటి మంచి అనేది జరగదు. అలాగే ఎసిడిటీ ఉన్నవారు కూడా అసలు దానిమ్మ గింజల్ని తినకూడదు. ఇక ముఖ్యంగా ఎవరికైతే లోబీపీ ఉంటుందో అటువంటి వాళ్ళు కూడా అస్సలు దీన్ని తీసుకొనే తీసుకోకూడదు. మరింత ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ పండు తొక్కలో రకారకల ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. వీటిని కూడా మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఔషధలో వాడుతూ ఉంటారు. ఈ తొక్కల నీ వాటిని శుభ్రంగా చేసుకొని ఎండలు ఎండబెట్టి పౌడర్లా చేసుకొని తాగవచ్చు.