Cool Water: కూల్ వాటర్ తాగితే ఎన్ని సమస్యలు వస్తాయో తెలుసా?

సాధారణంగా మన ఇంట్లో పెద్దలు కూల్ వాటర్ ఎక్కువగా తాగుతుంటే తాగకూడదని చెబుతూ ఉంటారు. అయితే కూల్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కూల్ వాటర్ తాగిన వెంటనే రాకపోయినా కూడా కొద్ది రోజులకు కూల్ వాటర్ తాగిన ప్రభావం కనిపిస్తుంది. చల్లని నీరు తాగడం వల్ల మన శరీరంలో ఉండే జఠరాగ్ని అనేది చల్లారిపోతుంది. చల్లని నీరు తాగిన తర్వాత చల్లారిన ప్రేగులు, కణాలు, నాడులు తిరిగి వేడెక్కడానికి […]

Published By: HashtagU Telugu Desk
Do you know how many health problems can arise from drinking cold water

Do you know how many health problems can arise from drinking cold water

సాధారణంగా మన ఇంట్లో పెద్దలు కూల్ వాటర్ ఎక్కువగా తాగుతుంటే తాగకూడదని చెబుతూ ఉంటారు. అయితే కూల్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కూల్ వాటర్ తాగిన వెంటనే రాకపోయినా కూడా కొద్ది రోజులకు కూల్ వాటర్ తాగిన ప్రభావం కనిపిస్తుంది. చల్లని నీరు తాగడం వల్ల మన శరీరంలో ఉండే జఠరాగ్ని అనేది చల్లారిపోతుంది. చల్లని నీరు తాగిన తర్వాత చల్లారిన ప్రేగులు, కణాలు, నాడులు తిరిగి వేడెక్కడానికి కొంత సమయం తీసుకుంటాయి.

అలా చల్లని నీరు తాగిన తర్వాత మళ్లీ 15 నిమిషాల సమయం తీసుకుని ఆ తర్వాత మళ్లీ యథాస్థితికి వస్తాయి. అలాగే గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల పొట్టలో కొవ్వు కరుగుతుంది. చల్లని నీరు తాగడం వల్ల కొవ్వులు గడ్డకట్టి తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి సమయం పడుతుంది. ఎప్పుడూ కూడా భోజనం చేసిన వెంటనే నీరు తాగకూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో తాగాలనిపిస్తే గోరువెచ్చని నీరు తాగండి. అదేవిధంగా చలికాలంలో బిందెలలో ఉన్న నీరు కూడా తాగకూడదు.

చల్లనివి తాగితే ప్రమాదమే, అలాగే అతి వేడి నీరు తాగినా కూడా లివర్కు, ప్రేగులకు ప్రమాదం. అంతేకాకుండా కూల్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కేలరీలు నెమ్మదిగా బర్న్ అయ్యి శరీర బరువు పెరగడానికి దోహదపడతాయి. అదేవిధంగా కూల్ వాటర్ జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఏ సీజన్లో అయినా కూడా కూల్ వాటర్ తాగడం అంత మంచిది కాదు. మనం కూల్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. అదేవిధంగా పోషకాలు కూడా శరీరానికి అందవు.

  Last Updated: 14 May 2026, 10:56 AM IST