Site icon HashtagU Telugu

Onions : ఉల్లిపాయను బిర్యానీతో పాటు తింటున్నారా.. అయితే సమస్యలు తప్పవు..

Dont Eat Raw Onions with Biryani or any another Food

Dont Eat Raw Onions with Biryani or any another Food

ఉల్లిపాయను(Onions) నేరుగా తినడం ఇప్పుడు అందరూ ఎక్కువగా చేస్తున్నారు. కానీ అలా తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉల్లిపాయను నిమ్మకాయ పిండుకొని బిర్యానీ(Biryani)తో గాని నాన్ వెజ్(Non Veg) తినేటప్పుడు గాని తింటూ ఉంటారు. కానీ ఇలా తినడం మంచిది కాదు. పచ్చి ఉల్లిపాయను తినడం ఎవ్వరికి కూడా మంచిది కాదు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని నానుడి ఉంది కానీ దేనినైనా మితంగా తినాలి లేకపోతే మన ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. ఉల్లిపాయలను కూరల్లో తినడం వేరు, పచ్చిగా తినడం వేరు. పచ్చి ఉల్లిపాయలను తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

* పచ్చి ఉల్లిపాయను తినడం వలన శరీరంలో చక్కర స్థాయిలు తగ్గుతాయి.
* పచ్చి ఉల్లిపాయను తినడం వలన అది మన జీర్ణవ్యవస్థలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియాను విడుదల చేస్తుంది. ఇది ప్రేగులపై ప్రభావం చూపుతుంది. దీని వలన జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.
* గర్భిణులు పచ్చి ఉల్లిపాయలను తినకూడదు తింటే వారికి వాంతులు, గుండెలో మంట, వికారం వంటి సమస్యలు పెరుగుతాయి.
* పచ్చి ఉల్లిపాయలను తినడం వలన కడుపులో నొప్పి వంటివి కలుగుతాయి.
* పచ్చి ఉల్లిపాయను తినడం వలన మలబద్దకం వంటి సమస్యలు కలుగుతాయి.
* పచ్చి ఉల్లిపాయను తినడం వలన నోటిలో దుర్వాసన ఏర్పడుతుంది.
* పచ్చి ఉల్లిపాయ విడుదల చేసే పొటాషియం లివర్ వ్యవస్థను దెబ్బతీస్తుంది.
* పచ్చి ఉల్లిపాయను తినడం వలన ఎసిడిటీ సమస్య వస్తుంది.

అందుకే బిర్యానీ, నాన్ వెజ్ వంటలతో ఉల్లిపాయ కలిపి తింటే బాగుంది కదా అని ఎక్కువగా తింటే తర్వాత ఈ అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది కాబట్టి మితంగా తినాలి. లేదా అసలు పచ్చి ఉల్లిపాయ తినడం మానెయ్యాలి.

 

Also Read : Water Apple: వాటర్ యాపిల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!