Blood Group : వెయిట్ లాస్ లో బ్లడ్ గ్రూప్ పాత్ర కూడా ఉంటుందా? ఎలా? ఏమిటి?

ఒక వ్యక్తి ఎంత బరువు తగ్గాలో (Weight Loss) నిర్ణయించే అంశాలు అనేకం ఉన్నాయి. వ్యక్తి తీసుకునే ఆహారం,

ఒక వ్యక్తి ఎంత బరువు తగ్గాలో (Weight Loss) నిర్ణయించే అంశాలు అనేకం ఉన్నాయి. వ్యక్తి తీసుకునే ఆహారం, శారీరక శ్రమ స్థాయిలు, వారి వయస్సు, రాత్రికి ఎంత టైం పాటు నిద్రపోతారు అనే అంశాల ఆధారంగా బరువు తగ్గుతారా ? లేదా ? అనేది నిర్ణయం అవుతుంది. అయితే, వీటన్నింటితో పాటు బరువు తగ్గడానికి బ్లడ్ గ్రూప్ (Blood Group) కూడా కీలకమైన అంశమే అని మీకు తెలుసా ? అదెలాగో తెలుసుకుందాం..

విపరీతమైన డైటింగ్ , వ్యాయామాల వల్ల కూడా కొందరి బరువు తగ్గదు. మరి బరువు పెరగడానికి కారణమయ్యే అంశాలు ఏమిటి అనేది మనం తొలుత గుర్తించాలి. ఈ జాబితాలో వయస్సు, జీవక్రియ, హార్మోన్ల అసమతుల్యత, ఇతర వైద్య పరిస్థితులు అనేవి ఉంటాయి. బ్లడ్ గ్రూపు ప్రకారం ఫుడ్ తీసుకోవడం వల్ల, వ్యాయామం చేయడం వల్ల, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గవచ్చని కొందరు వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రధానంగా 4 బ్లడ్ గ్రూప్స్ కు చెందిన వాళ్ల డైట్ లో నుంచి రొట్టె ,తృణధాన్యాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చికెన్ వంటివి తీసేయడం మంచిదని అంటున్నారు. ఎందుకంటే అవన్నీ శరీర బరువును పెంచే ఫుడ్స్ అని పేర్కొన్నారు.

బ్లడ్ గ్రూప్స్ (Blood Group) వారీగా డైట్ ప్లాన్:

O బ్లడ్ గ్రూప్ : లీన్ మాంసం, పౌల్ట్రీ, చేపలు, అధిక ప్రోటీన్ ఆహారం, ధాన్యాలు, బీన్స్, పాల ఉత్పత్తులు

A బ్లడ్ గ్రూప్ : పండ్లు, కూరగాయలు, బీన్స్, చిక్కుళ్ళు, తృణధాన్యాలు . వీటిలో సేంద్రీయ మరియు తాజావి తింటే బెస్ట్.

B బ్లడ్ గ్రూప్ : మొక్కజొన్న, గోధుమలు, బుక్‌వీట్‌లు, కాయధాన్యాలు, టమోటాలు, వేరుశెనగలు , నువ్వులు, చికెన్‌ను కొంత వరకు తినకండి. ఆకుపచ్చ కూరగాయలు, గుడ్లు, కొన్ని మాంసాలు, తక్కువ కొవ్వు ఉండే పాలను తీసుకోండి.

AB బ్లడ్ గ్రూప్ : టోఫు, సీఫుడ్, డైరీ, ఆకుపచ్చ కూరగాయలు తినొచ్చు. కెఫిన్, ఆల్కహాల్, స్మోక్డ్ లేదా క్యూర్డ్ మాంసాలను తినొద్దు.

ఏ బ్లడ్ గ్రూప్ (Blood Group) పై ఎలాంటి ప్రభావం?

🩸 O లేదా B బ్లడ్ గ్రూపులు ఉన్న స్త్రీలు స్థూలకాయానికి ఎక్కువగా గురవుతారు .

🩸 A బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తులు గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు మధుమేహం బారిన పడే అవకాశం ఉంది.

🩸 AB బ్లడ్ గ్రూప్ ఉన్నవారు అలెర్జీలతో బాధపడవచ్చు.

🩸 O బ్లడ్ గ్రూప్ లో కొంతమంది స్త్రీలకి స్థూలకాయం వచ్చే ముప్పు ఉంటుంది. డైటింగ్ చేయడం, వ్యాయామం చేయడం, ఎక్కువ పండ్లు మరియు కూరగాయలు తినడం ద్వారా వారు బరువు తగ్గొచ్చు.

Also Read:  Detox Drinks శరీరంలో ఉన్న విషాలను బయటికి పారదోలే పవర్ ఫుల్ డిటాక్స్ డ్రింక్స్ ఇవిగో..