‘జెల్లీ'(JELLY )ని చూస్తే ఎవరికైనా తినాలనిపిస్తుంది. ఇక పిల్లలైతే అస్సలు అగరు. షాప్స్ లలో , మాల్స్ లలో ఇలా ఎక్కడైనా ‘జెల్లీ’ కంటికి కనిపిస్తే కొనిచ్చేవరకు మారాంచేస్తారు. అయితే ఈ ‘జెల్లీ’ని తినడం వల్ల ఎంతో ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు మార్కెట్‌లో కొన్ని ఆహార పదార్థాలను పరీక్షించగా, ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా పిల్లలు తినే మామిడిపండు జెల్లీలో సల్ఫైట్ స్థాయిలు పది రెట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే వంట నూనెల్లో అసలేంటో తెలియని పదార్థాలు కలిపి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తేలింది. తదుపరి పరీక్షలలో కొన్ని టీ పొడి బ్రాండ్లు, బెల్లం, బిర్యానీ, మాంసాహారాలు, మిఠాయిల్లో అధిక స్థాయిలో రసాయనాలు, రంగులు ఉపయోగిస్తున్నారని వెల్లడైంది. ముఖ్యంగా దీపు మ్యాంగో జెల్లీ నమూనా పరీక్షించగా 100 పీపీఎంగా ఉండాల్సిన సల్ఫైట్ స్థాయి 1,146 పీపీఎం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Indiramma Housing Scheme Rules : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నిబంధనలు
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ రసాయనాలు వాంతులు, విరేచనాలు, చర్మ సమస్యలు, దీర్ఘకాలంలో నరాల సమస్యలు, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే ప్రమాదం ఉంది. ప్రీమియం క్వాలిటీ ఒరిజినల్ కిమియా డేట్స్ (కర్జూరం) లో బూజు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బెల్లంలో సల్ఫైట్, టెట్రాజైన్, సన్‌సెట్ ఎల్లో రంగులు కలిపినట్లు తేలింది. శ్రీసూర్య కాష్యూ బ్రాండ్ జీడిపప్పులో పురుగులు, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్నాయని తేల్చారు. అదేవిధంగా హెల్త్‌కేర్ రిఫైన్డ్ వంట నూనె నాణ్యతా ప్రమాణాలకు సరిపోలేదని, తప్పుడు సమాచారంతో మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తేలింది. ఈ వివరాలు వెలుగులోకి రావడంతో GHMC అధికారులు అనుమానాస్పద ఆహార ఉత్పత్తులపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఆహార పదార్థాలు కొనుగోలు చేసే ముందు బ్రాండ్ నాణ్యత, లేబుల్ పై ఉన్న సమాచారాన్ని ఖచ్చితంగా పరిశీలించాలి అని పేర్కొన్నారు.