ఇటీవల కాలంలో చాలామంది టాయిలెట్ (Toilet)కి వెళ్లేటప్పుడు మొబైల్ (Using Mobile) తీసుకెళ్లడం అలవాటుగా మార్చుకున్నారు. కమోడ్‌పై కూర్చుని మెసేజ్‌లు చదవడం, వీడియోలు చూడడం వంటి పనుల్లో మునిగిపోతుంటారు. కానీ ఇలా ఎక్కువసేపు టాయిలెట్‌లో గడిపితే శరీరానికి అనేక సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 10 నిమిషాలకు మించి టాయిలెట్‌లో ఉండటం వల్ల మలద్వారం చుట్టూ ఒత్తిడి పెరిగి పైల్స్, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. టర్కిష్ జర్నల్ ప్రకారం.. ప్రతి అదనపు నిమిషానికి పైల్స్ వచ్చే అవకాశాన్ని 1.26 శాతం పెరుగుతుందని చెప్పబడింది.
Office : మీరు ఆఫీసులో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారా..? అయితే ఇలా చెయ్యండి
అంతేకాదు టాయిలెట్ అనేది బ్యాక్టీరియాల నిక్షేపం. ఇక్కడ సాల్మోనెల్లా, ఇ-కోలి వంటి హానికరమైన సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఎక్కువ. వీటి ద్వారా యూరినరీ ఇన్ఫెక్షన్లు, అతిసారం, కడుపు నొప్పులు వంటి సమస్యలు తలెత్తవచ్చు. చాలా మంది టాయిలెట్‌కి వెళ్లిన తర్వాత చేతులు బాగా కడుక్కోకుండా ఆహారం తీసుకోవడం వల్ల ఈ బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్లే అవకాశముంటుంది. మొబైల్‌పై ఉండే క్రిములు కూడా అదే రీతిలో మలినతను కలిగించవచ్చు. దీర్ఘకాలంగా ఇలా జరిగితే కొన్ని సందర్భాల్లో జీర్ణ సమస్యలు తీవ్రరూపం దాల్చి క్యాన్సర్ దాకా దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్యల నివారణకు టాయిలెట్‌లో గరిష్ఠంగా 7 నుంచి 10 నిమిషాలకే పరిమితమవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ఫోన్, పుస్తకాలు, పేపర్లు వంటి వస్తువులను టాయిలెట్‌లోకి తీసుకెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. మరికొన్ని అధ్యయనాల ప్రకారం ఇండియన్ స్టైల్ టాయిలెట్లు వెస్ట్రన్ స్టైల్ కన్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయని తేలింది. ఎందుకంటే ఇండియన్ స్టైల్‌లో మల విసర్జన ప్రక్రియ సహజంగా, వేగంగా పూర్తవుతుంది. ఫలితంగా టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చునే అవసరం ఉండదు. కాబట్టి టాయిలెట్ వినియోగాన్ని సరికదా, సమయ పరిమితితో చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.