Sleep Well: మీరు రోజు సరిగ్గా నిద్రపోతున్నారా? ఇవి తెలుసుకోండి..

నిద్ర.. ఆరోగ్యానికి చాలా మంచిది. నిద్రలేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందులో గుండెనొప్పి కూడా అని చెబుతున్నాయి అధ్యయనాలు. పూర్తి వివరాలు చూద్దాం.

నేడు చాలా మంది గుండె సమస్యలతో కుప్పకూలుతున్నారు. పట్టుమని పాతికేళ్ళు దాటకుండానే తనువు చాలిస్తున్నారు. కొన్నిచోట్ల అయితే ఏకంగా 14, 15 ఏళ్ళ పిల్లలకే గుండెనొప్పులు వస్తున్నాయి. దీంతో గుండె విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. గుండె సమస్యలు రాకుండా ఉండలంటే ముందు నుంచి జాగ్రత్తగా ఉండాల్సిందే. అందులో ఒకటి మంచి ఆహారం, వ్యాయామం, నిద్ర (Sleep). అవును నిద్ర కూడా గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఎందుకో ఇప్పుడు చూద్దాం.

గుండె సమస్యలకి కారణంగా:

సిడ్నీ యూనివర్శిటీ పరిశోధకులు నిద్ర (Sleep) గురించి ఓ విషయం చెబుతున్నారు. అదేంటంటే.. హాయిగా నిద్రపోయినవారి గుండె ఆరోగ్యంగా ఉందని చెబుతున్నారు. మంచి నిద్ర, నిద్రలేమి, గురక, ఆలస్యంగా పడుకోవడం, పగటిపూట నిద్ర వంటి సమస్యలు అనేవి మగ, ఆడవారిలో గుండె సమస్యలకి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

నిద్రతో (Sleep) లింక్:

రెగ్యులర్‌గా సరైన నిద్రలేనివారు గుండె సమస్యలతో బాధపడుతున్నారని సిడ్నీ యూనివర్శిటీ నిపుణులు చెబుతున్నారు. ఇది అనేక సమస్యలకి కారణంగా మారుతుందని, అయితే నేడు గుండె సమస్యలు పెరుగుతూ సడెన్‌గా గుండెలు ఆగిపోతున్న నేపథ్యంలో ఈ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు.

హాయిగా నిద్రపోతే (Sleep) ఆరోగ్యం:

ముఖ్యంగా స్లీప్ ఆప్నియా గుండె సంబంధ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని తెలుసు. కానీ, ఈ పరిశోధనలు ముందుగా అందర్నీ అలర్ట్ చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అన్ని వయసుల వారికి నిద్ర అనేది చాలా ముఖ్యమని చెబుతున్నారు నిపుణులు. ఆరోగ్యకరమైన స్లీపర్స్‌తో పోలిస్తే తక్కువ నిద్రపోయే మహిళలకి గుండె సమస్యలు వస్తున్నాయి.

ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ గురించి:

గురక, నిద్రపోవడంలో ఇబ్బంది అనేది భవిష్యత్‌లో వచ్చే సమస్యలకి సంకేతం. కాబట్టి హాయిగా నిద్రపోవాలని సూచిస్తున్నారు నిపుణులు. నిద్ర సరిగా రాకపోతే నిద్రలేమి సమస్యలు ఉంటే కచ్చితంగా డాక్టర్స్‌ని కలిసి ఆ సమస్యకి పరిష్కారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

కేవలం ఆరోగ్య సమస్యలే కాదు. కొన్ని అలవాట్లు కూడా నిద్రలేమి సమస్యకి కారణంగా మారుతుంది. అందులో ముఖ్యంగా గ్యాడ్జెట్స్ ఎక్కువగా వాడడం, స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉండడం, ఒత్తిడి ఉంటున్నాయి. కాబట్టి ముందుగా వీటన్నింటిని దూరం చేసుకోవాలి. పడుకోవడానికి ముందు గ్యాడ్జెట్స్ వాడకపోవడమే మంచిది. ఒత్తిడి తగ్గేందుకు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి.

Also Read:  Vangaveeti Radha: జనసేనలోకి రాధా? లోకేష్ తో వంగవీటి భేటీ!