Sit and Work Tips : లేవకుండా కూర్చుని పని చేస్తున్నారా? ఇది మీకోసమే

గంటల తరబడి ఏళ్ల కొద్దీ పని (Work) చేసే వారికి ఆయువు తగ్గుతుందంటే నమ్మతారా? పలు అధ్యయన ఫలితాలను చూస్తే నమ్మాల్సిందే.

Published By: HashtagU Telugu Desk
Sit

Sit

గంటల తరబడి ఏళ్ల కొద్దీ పని (Work) చేసే వారికి ఆయువు తగ్గుతుందంటే నమ్మతారా? పలు అధ్యయన ఫలితాలను చూస్తే నమ్మాల్సిందే. ఒక రోజులో 11 గంటలు అంతకంటే ఎక్కువ సమయం పాటు కూర్చుని (Sit Down) పని (Work) చేసే వారు, తదుపరి మూడేళ్ల కాలంలో మరణించే రిస్క్ 40 శాతం ఉంటుందని ఆస్ట్రేలియా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ఒకటి హెచ్చరించింది. ఈ అధ్యయనాలన్నీ కూడా.. ఎక్కువ సమయం పాటు కూర్చుని (Sit Down) పని (Work) చేస్తే ఆరోగ్యానికి ముప్పు అని హెచ్చరిస్తున్నాయి. మన శరీరంలో 600 కు పైగా కండరాలు ఉంటాయి. రోజువారీ కార్యకలాపాలు సౌకర్యంగా, సజావుగా సాగేందుకు ఇవి ఆరోగ్యంగా ఉండాలి. ఒక సమన్వయంతో పని చేయాలి. సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల, దీనికి ఒత్తిడి తోడు కావడం వల్ల అది కండరాలపై భారం పెంచుతుంది. దీన్నే రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజూరీ అని అంటారు.

ఏడేళ్ల పాటు, రోజూ ఎక్కువ సమయం పాటు కూర్చుని పని చేయడం వల్ల మరణించే రిస్క్ 11 శాతం పెరుగుతున్నట్టు గుర్తించారు. రోజులో ఆరు గంటల కంటే ఎక్కువ సమయం పాటు కూర్చుని పని చేసే మహిళల్లో, ముందుగా మరణించే రిస్క్ 37 శాతం పెరుగుతుందని అమెరికన్ కేన్సర్ సొసైటీ వెల్లడించింది. 2012లో అమెరికాలో నిర్వహించిన మరొక అధ్యయనంలో.. రోజులో 3 గంటల పాటైనా కూర్చుని పని చేయడాన్ని తగ్గించుకున్న వారికి ఆయుర్ధాయం రెండేళ్ల వరకు పెరుగుతుందని తేలింది.

రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజూరీ (అదే పనిగా ఒత్తిడి వల్ల గాయాలు) వల్ల కండరాలు దెబ్బతింటాయి. ఇది మరింత అసౌకర్యం, నొప్పికి దారితీస్తుంది. దీన్ని నయం చేసుకోకపోతే మైయోఫాజియల్ పెయిన్స్ కింద మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరాల్లో ఉద్యోగ జీవనం, కార్యాలయాల్లో 8 గంటలకు మించి పని చేయడం వల్ల.. మెడ నొప్పి, భుజం నొప్పి, స్థూలకాయం, ఒత్తిడి, నడుం నొప్పి సమస్యలు కనిపిస్తాయి.

అధిక సమయం పాటు కూర్చోవడం వల్ల.. ముఖ్యంగా నడుం కింది భాగంలో ఒత్తిడి అధికంగా పడుతుంది. దీనివల్ల కొంత కాలానికి కాళ్లలో సామర్థ్యం తగ్గిపోతుంది. బలహీనత కనిపిస్తుంది. మన తల బరువు 5 కిలోలు ఉంటుంది. తలను ముందుకు వంచి ఎక్కువ సమయం పాటు పని చేయడం వల్ల.. మెడ కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. తల కింద పడకుండా ఉండేందుకు మెడ కండరాలు సపోర్ట్ ను ఇస్తాయి. అందుకే ఎక్కువ సమయం పాటు ఇలా పని చేయడం వల్ల మెడ నొప్పి వస్తుంది.

Also Read:  Weight Loss: శీతాకాలంలో బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఈ పండ్లు తినండి..

  Last Updated: 14 Dec 2022, 01:39 PM IST