ఈ రోజుల్లో ఎక్కువ మంది ఉద్యోగులు ఏసీ ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పనిచేయడం (Sitting and working) అలవాటుగా మార్చుకున్నారు. అయితే, దీని వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరంతరం కదలకుండా కూర్చుని ఉండడం వల్ల శరీర చురుకుదనం తగ్గిపోతుంది. దీని ప్రభావంగా అనేక వ్యాధులు దాడి చేసే అవకాశముంది. గంటల తరబడి కదలకుండా కూర్చుంటే, రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీని ప్రభావంతో బరువు పెరగడం, మధుమేహం రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా నడుము చుట్టూ కొవ్వు పేరుకోవడం గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది. వ్యాయామం లేకుండా కూర్చునే జీవనశైలి, మన ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలో పడేస్తుంది.
AP Gold Hub : దేశంలోనే అతిపెద్ద గోల్డ్‌హబ్ ఏపీలో.. ఏమేం ఉంటాయంటే..
మెడ, వెన్ను నొప్పులు ఎక్కువసేపు కూర్చుని ఉండే వారి మధ్య చాలా సాధారణంగా మారాయి. సరైన భంగిమలో కూర్చోకపోతే, ఇది స్పైన్‌కు తీవ్రమైన నష్టం కలిగించే ప్రమాదం ఉంది. రక్త ప్రసరణ మందగించడం వల్ల పక్షవాతం వచ్చే అవకాశమూ ఉంది. అంతేకాదు, కూర్చున్న పద్ధతి సరిగ్గా లేకపోతే, మోకాళ్ల నొప్పులు, కండరాల నిస్సత్తువ వంటి సమస్యలు ఏర్పడతాయి. దీని వల్ల కేవలం శారీరక సమస్యలే కాకుండా మానసిక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. నిరంతరం ఒకే చోట కూర్చుని ఉండటం డిప్రెషన్, అల్జీమర్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది. శరీర చురుకుదనం లేకపోతే, ఒత్తిడి అధికమై మానసిక ప్రశాంతత కోల్పోతారు. రోజూ కదలకపోతే, శరీర హార్మోన్ల సమతుల్యత కూడా దెబ్బతింటుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ప్రతి గంటకోసారి కదలాలి. కొద్దిసేపు నడవాలి, హఠాత్‌గా ఒకే చోట కూర్చోకుండా చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు.