Site icon HashtagU Telugu

Fits : ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో ఇనుప వస్తువులు ఎందుకు పెడతారో మీకు తెలుసా..?

Do You Know Why Iron Objects Are Placed In The Hand During Fits..

Do You Know Why Iron Objects Are Placed In The Hand During Fits..

మామూలుగా చాలామంది మూర్ఛ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. ఈ వ్యాధిని వాయి లేదా ఫిట్స్ (Fits) అని కూడా అంటూ ఉంటారు. ఈ సమస్య ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఎక్కడా ఎలా ఫిట్స్ (Fits) వచ్చి పడిపోతారో వాళ్లకు కూడా తెలియదు. అయితే ఇలా ఫిట్స్ వచ్చినప్పుడు వెంటనే ప్రతి ఒక్కరు చేసే పని ఇనుప తాళాలు ఇనుప వస్తువులు చేతుల్లో పెట్టడం. అలా ఎందుకు పెడతారు? అలా పెట్టడం వల్ల ఆ ఫిట్స్ (Fits) వచ్చిన వ్యక్తి నార్మల్ మనిషిగా ఎలా అవుతాడు? లాంటి విషయాలు చాలామందికి తెలియదు. మరి ఫిట్స్ వచ్చినప్పుడు చేతిలో ఇనుప వస్తువులు పెట్టడం వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

నాడి వ్యవస్థ పైన ప్రభావం పడే వ్యాధి మూర్ఛ వ్యాధి. ఇది ఎలాంటి వారికైనా వస్తుంది. ప్రతి ఏడాది ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య అంతకు అంతకు పెరుగుతూనే ఉంది. అయితే ఫిట్స్ వచ్చే ముందు ఎటువంటి లక్షణాలు కనబడవు. కావున మనిషి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిట్స్ వచ్చిన వెంటనే ఎవరైనా తాళాల కోసం వెతుకుతూ ఉంటారు. ఎందుకనగా ఫిట్స్ ని కంట్రోల్ లో ఉంచగలిగే శక్తి ఇనప వస్తువులకి మాత్రమే ఉందని అందరూ నమ్ముతుంటారు. అయితే ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. అయితే ఎవరికి అయిన ఫిట్స్ వచ్చినప్పుడు అది రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకే ఉంటుంది.

ఆ సమయంలో టెన్షన్ పడితే ఎక్కడో చోట తాళాలు గానీ ఇనుప వస్తువు చేతిలో పెట్టడం జరుగుతుంది. ఐదు నిమిషాల సమయంలో చేతులు కాళ్లు ఆడించడం ఆగిపోతుంది. దాంతో తాళాలు బాగా పనిచేశాయి అనుకుంటూ ఉంటారు. అయితే ఈ ఇనప రాడ్లు, తాళాలు పెట్టిన పెట్టకపోయినా రిజల్ట్ అనేది ఒకటే లాగా కనిపిస్తూ ఉంటుంది. ఫిట్స్ వ్యాధిని ఆపలేదు కావున ఆ టైంలో ఏం చేయాలంటే ఫిట్స్ వచ్చిన మనిషిని నేలపై పడుకోబెట్టాలి. మూర్చతో కొట్టుకుంటూ చేతులు కాళ్లు అటు ఇటు వేగంగా కదిలించిన అదేవిధంగా వదిలేయాలి. దానిని ఆపడానికి అస్సలు ట్రై చేయకూడదు. ఒకవేళ దానిని ఆపినట్లైతే వారికి ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది.

అదేవిధంగా ఫిట్స్ వచ్చిన రోగి నోట్లో నురగ వస్తూ ఉంటుంది. దాన్ని ఆపడానికి నోట్లో ఎటువంటి దుస్తులను వస్తువులను ఉంచకూడదు. వాళ్లు వాంతులు చేసుకుంటే వాళ్లని చేసుకోనివ్వాలి. ఈ ఫిట్స్ వచ్చిన మనిషికి గాలి తగిలేలా చూస్తూ ఉండాలి. తర్వాత వైద్య నిపుణుల దగ్గరికి తీసుకువెళ్లాలి. ఒకవేళ ఫిట్స్ వచ్చినా 5 నిమిషాలు అయినా కూడా ఆ మనిషి అలాగే కింద పడి గిలగిలా కొట్టుకుంటే వెంటనే వైద్యుని దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. వీలైనంతవరకు ఆ మనిషికి గాలి బాగా ఆడనివ్వడానికి స్వేచ్ఛను ఇవ్వాలి.

Also Read:  Dry & Rough Skin Tips : చర్మం పొడి భారీ గరుకుగా మారిందా ఇబ్బంది పడుతున్నారా..? అయితే ప్రతిరోజు ఈ జ్యూస్ తాగాల్సిందే..