Site icon HashtagU Telugu

Urine మూత్రం రంగు మారితే.. ఏం జరిగినట్టో తెలుసా?

Do You Know What Happens If The Color Of The Urine Changes

Do You Know What Happens If The Color Of The Urine Changes

మూత్రం (Urine) ద్వారా శరీరంలోని వ్యర్థాలను, అదనపు నీరు బయటకు వెళ్లిపోతాయి . అందుకే చాలా వ్యాధుల నిర్ధారణ కోసం యూరిన్ టెస్ట్ చేస్తారు. మీరు త్రాగే నీటిని బట్టి, తినే ఫుడ్ ను బట్టి కూడా మూత్రం రంగు మారుతుంది.అయితే మీ మూత్రం రంగు మారిందా ? ఏరంగులోకి మారింది ? ఎరుపు.. లేత పసుపు .. ముదురు పసుపు .. నారింజ రంగు.. ముదురు నారింజ.. గోధుమ రంగు.. ముదురు గోధుమ.. నలుపు వీటిలో ఏరంగులో మూత్రం వస్తోంది ? రంగును బట్టి కూడా మీకున్న ఆరోగ్య సమస్యలపై ఒక అంచనాకు రావచ్చు. ఎర్రటి మూత్రం (Urine) వస్తే డేంజర్. ముదురు పసుపు రంగులో వస్తే మీ బాడీ బాగా డీ హైడ్రేషన్ కు గురైందని అర్ధం చేసుకోవచ్చు.

తెలుపు మూత్రం

చైల్రియా అనేది జీర్ణక్రియ సమయంలో రిలీజ్ అయ్యే పదార్థం. దీనివల్ల మూత్రం తెల్ల రంగులోకి మారుతుంది.

 నారింజ రంగు మూత్రం

లేత నారింజ రంగు మూత్రం వస్తే మీరు డీ హైడ్రేషన్ కు గురయ్యారని అర్థం. రిబోఫ్లావిన్ వంటి కొన్ని విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కూడా యూరిన్ నారింజ రంగులోకి మారుతుంది .

లేత పసుపు మూత్రం

మూత్రం లేత పసుపు రంగులో ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టు. తగినంత నీరు తాగుతున్నారు, హైడ్రేటెడ్ గా ఉంటున్నారు అని ఇది సూచిస్తుంది.

ముదురు పసుపు మూత్రం

ముదురు పసుపు రంగు మూత్రం.. మీరు డీ హైడ్రేషన్ కు గురయ్యారు అనే దానికి సంకేతం. ఇకపై మీరు ఎక్కువ నీరు త్రాగాలి. రోజుకు సుమారుగా 6-8 గ్లాసుల నీటిని తాగాలి.

నలుపు మూత్రం

నలుపు లేదా ముదురు గోధుమ రంగు మూత్రం కాలేయంలో సమస్యకు ఒక సంకేతం కావచ్చు. మీరు ఒకసారి మూత్ర పరీక్ష చేయించుకోవడం మంచిది.

ఎరుపు మూత్రం

ఎరుపు మూత్రం అనేది ప్రమాదకర పరిస్థితి. మూత్రంలో రక్తం, లేదా హెమటూరియా ఉండటం వల్ల ఈ రంగులో మూత్రం వస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI), ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీ స్టోన్స్ వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుంది.

నీలం రంగు మూత్రం

కొన్నిరకాల ఔషధాల వాడకం లేదా పెద్ద మొత్తంలో ఫుడ్ కలర్ కలిగి ఉన్న ఆహారాలు తినడం వలన నీలం లేదా ఆకుపచ్చ మూత్రానికి కారణమవుతుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

Also Read:  High Cholesterol: ఈ టిప్స్‌ ఫాలో అయితే అధిక కొలెస్ట్రాల్‌ త్వరగా కరుగుతుంది.