Site icon HashtagU Telugu

Butterfly Pea Flowers : పవర్‌ఫుల్ పూలు.. చర్మ సమస్యలు, జీర్ణ సమస్యల నుంచి ఊరట

Butterfly Pea Flowers

Butterfly Pea Flowers

Butterfly Pea Flowers : ‘బటర్ ఫ్లై పీ ఫ్లవర్స్‌’ను శంఖు పుష్పాలు అని పిలుస్తారు. వాటి రూపం శంఖు ఆకారంలో ఉంటుంది. రంగు నీలంగా ఉంటుంది. వీటిని శివపూజలో ఉపయోగిస్తుంటారు. ఈ పూలను ఆయుర్వేదంలో పలు రోగాల చికిత్సకు వాడుతుంటారు. ఇంతకీ ఆయుర్వేద చికిత్సల్లో ఈ పూలను ఎందుకు వాడుతారో తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

  • కడుపు పూతలు, పొత్తి కడుపు వద్ద నొప్పులు, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు పోవడానికి సప్లిమెంట్​గా ఆయుర్వేదంలో బటర్ ఫ్లై పీ ఫ్లవర్స్‌’ను వాడుతుంటారు.
  • బటర్ ఫ్లై పీ ఫ్లవర్స్‌’ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి మన చర్మానికి టాక్సిన్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి.  మొటిమలు రాకుండా చేస్తాయి. వీటిలోని యాంటీప్రూరిటిక్ లక్షణాల వల్ల చర్మం దురద, మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యల చికిత్సలోనూ ఆయుర్వేద వైద్యులు బటర్ ఫ్లై పీ ఫ్లవర్స్‌’ను వాడుతుంటారు.
  • ఆయుర్వేద వైద్యుల సలహాతో..  శంఖుపూల పొడిని ఒక చెంచాలో తీసుకుని నీరు లేదా పాలతో కలిపి తాగితే అలసట సమస్య మటుమాయం అవుతుంది. ఫలితంగా మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది. ఈ పూలలోని సమ్మేళనాలు మెదడుకు ఊరట దక్కేలా చేస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
  • మెదడులో డోపమైన స్రావాన్ని పెంచేందుకు ఈ పూలు సహాయం చేస్తాయి. డోపమైన్స్ మీ మనస్సును రిలాక్స్​గా ఉంచే న్యూరో ట్రాన్స్​మీటర్లను సమతుల్యం చేస్తాయి.
  • శంఖుపూలు, శంఖు పూల పొడి మీకు తలనొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
  • శంఖుపూలు మీ నాడీ వ్యవస్థలోని ఒత్తిడి స్థాయులను తగ్గిస్తాయి.
  • ఈ పూలను వాడేముందు ఆయుర్వేద వైద్యుల సూచన తప్పనిసరి అని(Butterfly Pea Flowers) గుర్తుంచుకోండి.

Also Read: 32nd Time Contest : 32వసారి ఎన్నికల బరిలో ఉపాధిహామీ కూలీ

​​గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ,  మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే.