Site icon HashtagU Telugu

Chapati and Rice : చపాతీ, అన్నం కలిపి తింటే ఎన్ని రకాల సమస్యలు వస్తాయో మీకు తెలుసా?

Do You Know How Many Types Of Problems Can Arise If Chapati And Rice Are Eaten Together..

Do You Know How Many Types Of Problems Can Arise If Chapati And Rice Are Eaten Together..

Stop eating Chapati and Rice together : ఈ రోజుల్లో చాలామంది తగ్గించుకోవడం కోసం సాయంత్రం అయ్యింది అంటే చాలు చపాతిని తింటూ ఉంటారు. అయితే కొంతమంది చపాతీ (Chapati)తో పాటు అన్నం (Rice) కూడా తింటూ ఉంటారు. ఇవి రెండూ కలిపి తింటే మరింత టేస్ట్ ఉంటాయి అని చాలామంది చపాతీ రైస్ (Chapati, Rice)ని కలిపి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే చపాతి అన్నం కలిపి తినకూడదట. ఇలా కలిపి తింటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చపాతి అలాగే అన్నంలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ రెండిట్లో ఉండే పోషకాల వలన శరీరంలో జీవ ప్రక్రియకు గురవుతూ ఉంటాయి. వాటి గ్లైసోమిక్ సూచిక కూడా చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి చపాతి,అన్నం కలిపి తినడం ఇక మీదట మానుకోవడం చాలా మంచిది. ఈ రెండు కలిపి తినడం కాకుండా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పదార్థాన్ని తీసుకోవడం చాలా మంచిది. ఒకవేళ ఈ రెండు తీసుకోవాలి అనుకున్న వారు కచ్చితంగా ఆ రెండింటికి మధ్య కాసేపు గ్యాప్ ఉంచాలి. ఆపై రెండు గంటల తర్వాత అన్నం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల రెండిట్లో ఉండే పోషకాహారాన్ని పొందవచ్చు. ఇలా వేరువేరుగా తినడం వలన గ్యాస్, అజీర్ణం లాంటి సమస్యలు రావు.

రైస్, రోటి రెండింటి లోనూ కార్బోహైడ్రేట్ పుష్కలంగా లభిస్తాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో స్టార్చ్ శోచించబడుతుంది. ఈ రెండిటిని కలిపి తింటే అజీర్ణం పోవడమే కాకుండా కడుపుబ్బరం అనే సమస్య ఎదురవుతుంది. చపాతి, అన్నం కలిపి తీసుకోవడం వలన వీటిలో ఉండే పోషకాలు శరీరంలో ఘర్షణ ఏర్పడుతుంది. ఇది వాటి శోషణకు ఆటంకం కలిగిస్తుంది. కొన్ని కొన్ని సార్లు కడుపు నొప్పి ఇలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి రెండు తినాలి అనుకున్న వారు కాస్త గ్యాప్ తీసుకోవడం మంచిది. లేదు అంటే ఉదయాన్నే చపాతి లేదంటే మధ్యాహ్నం చపాతి ఆ తర్వాత రాత్రి సమయంలో భోజనం తీసుకుంటే చాలా మంచిది. లేదంటే మధ్యాహ్నం భోజనం తిని రాత్రి సమయంలో చపాతి తిన్న కూడా చాలా మంచిది

Also Read:  H1B Visa : గుడ్ న్యూస్.. హెచ్‌-1బీ వీసాల రెన్యూవల్ ఇక అమెరికాలోనే