విటమిన్ సీ (Vitamin C) ఇటీవల కాలంలో తరచుగా వినిపిస్తున్న మాట. కొవిడ్ (Covid 19) నివారణలో విటమిన్ సీ తో అనేక లాభాలు ఉండటంతో చాలామంది వాడుతున్నారు. కొవిడ్, ఇమ్యూనిటీ మాత్రమే కాదు.. దీన్ని వల్ల ఆరోగ్య (Health Benefits) ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసా..
- ఇది జీవక్రియ, ప్రేగు కదలికలను వేగవంతం చేస్తుంది.
- మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్‌ను నియంత్రించుకోకపోతే.. వారు అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. షుగర్ పేషెంట్లలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.
- డయాబెటిక్ పేషెంట్లు షుగర్‌ని నియంత్రించకపోతే, వారికి గుండె జబ్బులు, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యకరమైన ఆహారం, చురుకైన శరీరం, కొన్ని ఇంటి నివారణలు మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు చేస్తుంది.
- మధుమేహాన్ని నియంత్రించడంలో నిమ్మ వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని కూడా రక్షిస్తుంది. షు
- గర్ పేషంట్స్ నిమ్మరసం తీసుకోవడం వల్ల ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.నిమ్మకాయ అనేది విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉన్న ఒక పండు, ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
- నిమ్మకాయ చాలా తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది. ఇది చక్కెరను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తుంది.
- ఉదయాన్నే ఒక గ్లాస్ నిమ్మరసంలో కాస్త తేనెని మిక్స్ చేసి లేదా అలాగే తాగినా కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
- నిమ్మకాయ ఒక సిట్రస్ ఫ్రూట్. ఇందులో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ బి6 పొటాషియం ఇంకా ఫైబర్ ఇంకా అలాగే పెక్టిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తాయి. అలాగే శరీరానికి హానీ చేసే ప్రీ రాడికల్స్ నుంచి కూడా మనల్ని రక్షిస్తాయి.
- ఇక నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి రోగాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
- నిమ్మకాయ నీటిని తాగడం వల్ల కడుపు ఇంకా నడుము చుట్టూ కూడా పేరుకుపోయిన కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.