సాధారణంగా చాలామందికి ఏవి ఆరోగ్య ప్రయోజనాలో, వాటి వల్ల ఉపయోగాలు ఏమిటో తెలుసుకోరు. అందరికీ బూడిద గుమ్మడి కాయ గురించి తెలిసినప్పటికీ, వాటి వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవడం లేదు. కానీ దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే బోలెడు ఆరోగ్యం పొందవచ్చు. శరీరంలో ఉన్న టాక్సిన్లు, క్రిములు, వ్యర్థ పదార్థాలను గ్రహించి విసర్జక వ్యవస్థ నుంచి బయటకు పంపేస్తాయి. అంతర్గత వ్యవస్థ ఇటే శుద్ధి అవుతుంది. ఇందులో ఉన్న కాల్షియం, ఐరన్, పాస్పరస్, విటమిన్ సీలు శరీరానికి మరింత లాభాన్ని చేకూరుస్తాయి. అయితే దీని జ్యూస్ చేసేముందు విత్తనాలను తీసేయాల్సి ఉంటుంది. మలబద్ధకంతో బాధపడుతున్నవారు, జీర్ణ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారికి ఇది సరైన మందు.
దీనిని పొడిగా చేసుకుని కొబ్బరి నీళ్లు, నిమ్మ రసం, ఉసిరి రసంతో పాటు తాగాలి. గ్యాస్ట్రోఎంట్రిక్ సమస్యలు ఉన్నా.. కొబ్బరిపాలతో పాటు తీసుకుంటే కచ్చితంగా ఉపశమనం వస్తుంది. ఫిటోటేరాపియా స్టడీ ప్రకారం.. మార్ఫిన్ లెవల్స్ ను కూడా ఈ జ్యూస్ కంట్రోల్ చేస్తుంది. డైలీ తాగడం వల్ల మాదక ద్రవ్యాలకు బానిస అయిన వాళ్లు కూడా వ్యసనాన్ని మానుకుంటారు. తక్కువ బరువు ఉన్నవాళ్లు రోజూ క్రమం తప్పకుండా తాగితే మెటబాలిజం మెరుగై పోషక విలువలు అందుకుంటారు.
ఆహారం తీసుకోవడం మందగించిన వాళ్లకు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోవాలి. శరీరంలో ఎసిడిటీని తగ్గించడం. ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. బరువు తగ్గుతారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం తగ్గుతుంది. దంత, చిగుళ్ల సమస్యలు పోతాయి. ఉబ్బరం సమస్య ఉండదు.బూడిదగుమ్మడికాయ రసం తాగడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలు, క్రిములు బయటకు పోతాయి. మెటబాలిజం మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య కూడా ఉండదు.
Also Read: Harish Rao: రుణమాఫీ చేసి, మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్!