Site icon HashtagU Telugu

Jaggery And Turmeric : బెల్లంతోపాటు ఈ ఒక్కటి కలిపి తింటే శరీరానికి ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?!

Do you know how many benefits your body gets if you eat this together with jaggery?!

Do you know how many benefits your body gets if you eat this together with jaggery?!

Jaggery And Turmeric : మన వంటగదిలో ప్రతిరోజూ వాడే రెండు ముఖ్యమైన పదార్థాలు పసుపు, బెల్లం. వంటకు రంగు, రుచి ఇవ్వడమే కాదు, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని తెలుసా? ఆయుర్వేద నిపుణుల ప్రకారం, ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకోవడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పసుపులో ఉండే కర్క్యుమిన్ (Curcumin) అనే పదార్థం శక్తివంతమైన యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలో వాపులను తగ్గించడమే కాకుండా, యాంటీ ఆక్సిడెంట్ గుణాల వలన హానికరమైన రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో బెల్లం సహజ శక్తిని ఇచ్చే పదార్థంగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్‌, జింక్‌ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

చలికాలంలో అద్భుత ఔషధం

చలికాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటివి తరచూ ఇబ్బంది పెడతాయి. అలాంటప్పుడు బెల్లం, పసుపు మిశ్రమం వాడితే గొంతు నొప్పి తగ్గుతుంది, శ్వాసనాళాల్లో ఉన్న కఫం కరిగిపోతుంది. గ‌ర‌గ‌ర‌, మంట వంటి గొంతు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ మిశ్రమం శ్వాసకోశ వ్యవస్థను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. దీంతో ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది. దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది ఒక సహజమైన టోనిక్ లాంటిది.

జీర్ణవ్యవస్థకు మేలు

పసుపు మరియు బెల్లం కలిపి తీసుకుంటే జీర్ణాశయంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇందులో ఉండే రసాయనాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఫలితంగా అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలోని వ్యర్థాలు, టాక్సిన్లు బయటకు వెళ్లి శరీరం శుభ్రంగా మారుతుంది. ముఖ్యంగా కిడ్నీలు, లివర్ డీటాక్స్ అవుతాయి.

శక్తి, ఉత్సాహానికి మంత్రిలాంటిది

ఉదయం ఈ మిశ్రమాన్ని తీసుకుంటే రోజంతా శక్తివంతంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారు. బెల్లం అందించే తక్షణ శక్తి, పసుపు ద్వారా వచ్చే శరీరశుద్ధి రెండూ కలిపి శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. అలసట, నీరసం పోతాయి. శక్తి స్థాయిలు నిలకడగా ఉంటాయి.

కీళ్ల నొప్పులకు ఉపశమనం

పసుపులో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు మోకాళ్ల నొప్పులు, కీళ్ల వాపుల‌ను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయి కాబట్టి, ఈ సమయంలో బెల్లం, పసుపు మిశ్రమం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే కండరాల నొప్పులు కూడా తగ్గుతాయి.

రక్త శుద్ధి & రోగ నిరోధక శక్తి

బెల్లం, పసుపు మిశ్రమం తీసుకోవడం వలన రక్తం శుద్ధి అవుతుంది. రక్తంలోని మలినాలు బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా చర్మవ్యాధులు, అలర్జీలు తక్కువవుతాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.

ఎలా తీసుకోవాలి?

ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా తురిమిన బెల్లం, అరక‌ప్పు పసుపు కలిపి ప్రతి ఉదయం తీసుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మరింత మంచిది. అయితే మోతాదులో తీసుకోవడం అవసరం. ఎక్కువగా తీసుకుంటే అసౌకర్యాలు కలగవచ్చు.

తేలికగా, సహజంగా ఆరోగ్యం

ఇలా చూస్తే, పసుపు, బెల్లం మిశ్రమం మన వంటగదిలో ఉండే సాధారణ పదార్థాలే అయినా, ఆరోగ్యానికి కలిగించే మేలు మాత్రం అసాధారణం. సహజంగా, ఖర్చు లేకుండా ఎలాంటి రిస్క్ లేకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఈ మిశ్రమాన్ని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి.

Read Also: TTD : టీటీడీ వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా..?