Cauliflower Rice : కొంతమంది క్యాలీఫ్లవర్ రైస్ ను వైట్ రైస్ కి బదులుగా వాడతారు. ఇప్పుడు చాలా మంది అధిక బరువు, కొలెస్ట్రాల్, డయాబెటిస్ వంటి జబ్బులతో బాధ పడుతున్నారు. అయితే వీరందరూ వైట్ రైస్ కు ప్రత్యామ్నాయాలను వాడుతున్నారు. దీనిలో భాగంగానే క్యాలీఫ్లవర్ రైస్ వాడుతున్నారు. క్యాలీఫ్లవర్ రైస్ ను క్యాలీఫ్లవర్ ను తురమడం లేదా ముక్కలు చేయడం, కొన్ని ప్రాసెస్ ల ద్వారా తయారుచేస్తారు.
క్యాలీఫ్లవర్ రైస్ బయట షాపుల్లో, సూపర్ మర్కెట్స్ లో, ఆన్లైన్ లో దొరుకుతుంది. ఇది చూడడానికి వైట్ రైస్ లాగానే ఉంటుంది. దీంట్లో పిండి పదార్థాలు, క్యాలరీలు తక్కువగాను మరియు విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చాలామంది వైట్ రైస్ కు ప్రత్యామ్నాయంగా క్యాలీఫ్లవర్ రైస్ ను ఉపయోగిస్తున్నారు. క్యాలీఫ్లవర్ రైస్ లో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, ఫైబర్, పొటాషియం, మాంగనీస్, ఫోలేట్ పోషకాలు ఉన్నాయి.
క్యాలీఫ్లవర్ లో తక్కువ క్యాలరీలు ఉండడం వలన బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. క్యాలీఫ్లవర్ రైస్ ను వైట్ రైస్ కి బదులుగా తినడం వలన డయాబెటిస్ తగ్గడానికి సహాయపడుతుంది. క్యాన్సర్, గుండె జబ్బులు వంటివి రాకుండా ఉండడానికి సహాయపడుతుంది. క్యాలీఫ్లవర్ లో ఉండే ఫైబర్ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. క్యాలీఫ్లవర్ లో ఉండే గ్లూకోసినోలేట్, ఐసోథియోసైనేట్ అనే యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ తో పోరాడి మన శరీర ఆరోగ్యాన్ని కాపాడతాయి. క్యాలీఫ్లవర్ రైస్ తినడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు.
Also Read : World Health Day 2024: మంచి ఆరోగ్యం కోసం.. 5 గోల్డెన్ రూల్స్, అవి ఇవే..!