Site icon HashtagU Telugu

Sleeping After Lunch: అన్నం తిన్న వెంటనే నిద్ర వస్తుందా?

food and lazyness

food and lazyness

మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రమత్తుగా అనిపించటం.. కొందరికి కాసేపు పడుకుంటే (Sleeping) గానీ హుషారు కలగదు. ఇంతకీ అన్నం తిన్న తర్వాత ఎందుకు మత్తుగా అనిపిస్తుంది? దీనికి కారణం అన్నంలోని గ్లూకోజు రక్తంలో వేగంగా కలవటమే. అంతేకాదు, అన్నంతో ప్రశాంతతను కలగజేసే మెలటోనిన్‌, సెరటోనిన్‌ వంటి హార్మోన్లూ విడుదలవుతాయి. ఇవి విశ్రాంతి (Sleeping), మత్తు భావనను కలిగిస్తాయి. ఒక్క అన్నమే కాదు.. చాలారకాల పిండి పదార్థాలతోనూ ఇలాగే అనిపిస్తుంది. మరి దీన్ని అధిగమించటమెలా?

1. సహజంగానే మధ్యాహ్నం వేళకు మానసిక శక్తి సన్నగిల్లుతుంది. దీనికి అన్నం కూడా తోడైతే మరింత నిద్ర ముంచుకొస్తుంది. కాబట్టి కాస్త ప్రొటీన్‌ ఎక్కువగా గల ఆహారం తినటం మంచిది. ఇది డోపమైన్‌, ఎపినెఫ్రిన్‌ వంటి చురుకైన రసాయనాలను మెదడు సంశ్లేషించుకోవటానికి తోడ్పడుతుంది.

2. అన్నం తినకుండా ఉండలేకపోతే మామూలు బియ్యం కన్నా పొడవైన బాస్మతి బియ్యం వాడుకోవటం మంచిది. వీటిలోని గ్లూకోజు అంత త్వరగా రక్తంలో కలవదు. అలాగని సుష్టుగా తింటారేమో. కొద్దిగానే తినేలా చూసుకోవాలి.

3. అన్నానికి బదులు జొన్న, సజ్జ, గోధుమ రొట్టెల్లో ఏదైనా తినొచ్చు. రొట్టెలతో పాటు పన్నీరు లేదా సోయా నగెట్స్‌ తీసుకోవచ్చు. మాంసాహారులైతే కూరగాయలు, సలాడ్‌తో కలిపి చికెన్‌ తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది.

Also Read:  Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ఇంటి వద్ద భారీ ఉద్రిక్తత