పచ్చి బఠాణీలు (Green Peas) వంటకాలకు మంచి రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి (Health) కూడా ఎంతో మేలు చేస్తాయి. పచ్చి బఠాణీలలో అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. పచ్చి బఠాణీల వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
పచ్చి బఠాణీలు (Green Peas) ఎముకలను బలోపేతం చేయడానికి బాగా పని చేస్తాయి. కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు ఇందులో ఉంటాయి. తద్వారా ఎముకలు, కండరాలను దృఢంగా మారుతాయి. శరీరాన్ని దృఢపరచడంలో సహాయపడి విటమిన్లు కూడా బఠానీల్లో ఉంటాయి. పచ్చి బఠాణీలలో ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి కాపాడతాయి. పచ్చి బఠాణీలలో ఉండే ఫ్యాటీ యాసిడ్ అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిని తింటే మెదడు బాగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. పచ్చి బఠాణీలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బఠానీలు తినడం వల్ల కణాలు, కణజాలాలు ఆరోగ్యంగా ఉంటాయి. క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది.
ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల అంటు వ్యాధులు రావు. త్వరగా పట్టవు మరియు ఆరోగ్యంగా ఉంటాము. ఇందులో ఉండే మెగ్నీషియం.. అనేక వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది. పచ్చి బఠాణీలు చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యలను దూరం చేస్తాయి. శనగలు తినడం వల్ల రక్తం శుద్ధి కావడంతో పాటు చర్మానికి నిగారింపు వస్తుంది.
Also Read: Weight Loss: శీతాకాలంలో బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఈ పండ్లు తినండి..