Site icon HashtagU Telugu

Water vs Food : అలాంటి ఆహార పదార్థాలు తిన్న తర్వాత నీరు తాగుతున్నారా.. అయితే జాగ్రత్త?

Drinking Water

Drinking Water

Drinking Water in between Eating Food : మామూలుగా చాలా మంది సీజన్ తో సంబంధం లేకుండా నీరు బాగా తాగుతూ ఉంటారు.. ఇంకొందరు చలికాలంలో తక్కువ ఎండాకాలంలో ఎక్కువ నీళ్లు తాగుతూ ఉంటారు. ఆ సంగతి నీతి పక్కన పెడితే చాలామందికి భోజనం చేస్తున్నప్పుడు కానీ లేదంటే ఇతర ఆహార పదార్థాలు తింటున్నప్పుడు ముద్ద ముద్దకు నీళ్లు తాగడం అలవాటు. ఇలా భోజనం చేసేటప్పుడు ప్రతి ముద్దకు నీరు (Water) తాగడం వల్ల అలాంటివారు ఎక్కువ భోజనం తినలేరు. ఇంకొందరు భోజనం తిన్న తర్వాత కొద్దిసేపు నీరు (Water) తాగకుండా అలాగే ఉంటారు. ఇంకొంతమంది భోజనం చేసే వరకు నీళ్లు ముట్టకుండా భోజనం అంతా పూర్తి అయ్యాక కొంచెం నీరు తాగుతూ ఉంటారు.

We’re now on WhatsApp. Click to Join.

మామూలుగా చాలామంది ఆహారం తిన్న వెంటనే వీటిని తాగు కూడదు అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే తిన్న తర్వాత వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణం కావడంలో ఇబ్బందులు కలుగుతాయని చెబుతూ ఉంటారు. ఒకవేళ గోరువెచ్చ నీరు తాగితే ప్రమాదం లేదు కానీ చల్లని నీరు తాగితే మాత్రం ప్రమాదం అంటున్నారు. ఆహార పదార్థాలతో పాటు మనం తిన్న తర్వాత నీటిని తాగినట్లయితే ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే ఎన్నో వివరాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా పండ్లు తిన్న తర్వాత నీటిని తీసుకోకూడదు ఎందుకనగా ఇది శరీర సమతుల్యతను దెబ్బతీస్తాయి. అలాగే అరటి పండు తిన్న తర్వాత కనీసం అరగంట పాటు నీటిని తీసుకోకూడదు. పాలు తాగిన తర్వాత నీటిని ఎప్పుడూ తాగకూడదు.

ఎందుకనగా ఈ విధంగా తాగడం వలన పాలపు రొటీన్ జీవక్రియ మందకిస్తుంది. దాని వలన ఎసిడిటీ అజీర్ణం లాంటి వ్యాధులు సంభవిస్తాయి. కావున పాలు తాగిన వెంటనే నీటిని తీసుకోకూడదు. పుచ్చకాయలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. జీర్ణ రసాలు తీసుకున్న తర్వాత నీటిని తాగడం వలన పల్చబరుస్తుంది. దీని మూలంగా మీ కడుపు ఉబ్బరిస్తుంది. అలాగే కడుపునొప్పి సమస్యలు వస్తాయి. నారింజ, ఉసిరి సీజనల్ మొదలైన సిట్రస్ పండ్లను తిన్న వెంటనే మన జీర్ణ వ్యవస్థనుండి బయటికి వస్తాయి. మరి ఈ పండ్లను తిన్న తర్వాత నీటిని తీసుకున్నట్లయితే పీహెచ్ లెవెల్స్ చెదిరిపోతాయి. కావున పుల్లటి పండ్లు తిన్న తర్వాత నీటిని అస్సలు తాగకూడదు.. తరచుగా స్వీట్లు తిన్న వెంటనే నీటిని తాగుతూ ఉంటారు. కానీ అలా చేయడం మర్చిపోవాలి. ఎందుకనగా తీపి తిన్న వెంటనే నీటిని తీసుకుంటే అది గొంతు నొప్పి లేదా దగ్గుకి కారణం అవుతూ ఉంటుంది..

Also Read:  Betel Leaf Tips : వామ్మో.. తమలపాకు ఎక్కువగా తీసుకుంటే అలాంటి వ్యాధులు వస్తాయా!