Health : స్వీట్ ఐటమ్స్ ఎవరికి ఇష్టం ఉండవు? కేకులు, చాక్లెట్లు, స్వీట్లు… ఇవి మన మూడ్‌ను క్షణాల్లో మార్చేస్తాయి. అయితే, ఈ రుచి మన ఆరోగ్యానికి ఎంత హానికరం అనేది చాలా మంది పట్టించుకోరు. తీపి వస్తువులను అధికంగా తీసుకోవడం వల్ల కేవలం బరువు పెరగడం మాత్రమే కాదు, అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ వ్యసనం మన శరీరంపై చూపించే ప్రతికూల ప్రభావాలు చాలా తీవ్రమైనవి. అయినప్పటికీ కొందరు తీపి వస్తువులు తీసుకోవడం మాత్రం మానరు. ఏం జరుగుతుంది తీపి తింటే.. తర్వాత చూసుకుందాం లే.. ప్రస్తుతానికి మన ముందున్నవి లాగించేద్దాం అని అనుకుంటుంటారు.
Health : విటమిన్ డి సమస్య వేధిస్తుందా? ఇలా చేస్తే మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు!
అయితే, తీపి వస్తువుల్లో ఒకటైన అధిక చక్కెర వినియోగం వల్ల కలిగే మొదటి ప్రభావం బరువు పెరగడం. చక్కెరలో క్యాలరీలు అధికంగా ఉంటాయి, కానీ పోషకాలు చాలా తక్కువ. ఇవి త్వరగా కొవ్వుగా మారి శరీరంలో నిల్వ ఉంటాయి. దీనివల్ల ఊబకాయం వస్తుంది, ఇది గుండె జబ్బులు, మధుమేహం, కీళ్ల నొప్పులు వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు మూల కారణం. అంతేకాకుండా, అధిక చక్కెర రక్తంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచి, టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది.
తీపి వస్తువులు దంత ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం. చక్కెర నోటిలోని బ్యాక్టీరియాకు ఆహారంగా మారి, ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆమ్లాలు దంత ఎనామిల్‌ను దెబ్బతీసి, దంతక్షయం (పంటి పురుగులు), చిగుళ్ల వ్యాధులకు కారణమవుతాయి. తరచుగా తీపి తినే వారికి దంత సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. అంతేకాకుండా, అధిక చక్కెర వినియోగం కాలేయాన్ని దెబ్బతీసి, ఫ్యాటీ లివర్ సమస్యలకు దారితీస్తుంది. త్వరగా ఈ సమస్యలను గుర్తించేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.
మానసిక ఆరోగ్యంపై కూడా తీపి ప్రభావం చూపుతుంది. చక్కెరను అధికంగా తీసుకునే వారికి డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. చక్కెరను తగ్గించడం వల్ల శక్తి స్థాయిలు మెరుగుపడతాయి, మూడ్ కూడా స్థిరంగా ఉంటుంది. కాబట్టి, రుచికి లొంగిపోయి ఆరోగ్యానికి చేటు తెచ్చుకోకుండా, తీపి వస్తువుల వినియోగాన్ని నియంత్రించడం తెలివైన పని. ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
Actor Sriram Arrested: డ్రగ్స్ కేసు.. పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్!