Death Facts : మనిషి చనిపోయినా.. ఈ అవయవాలు పనిచేస్తాయి తెలుసా ?

మనిషి చనిపోయాక(Death Facts) పొట్టలో గ్యాస్ పుడుతుంది. దీనివల్ల శరీరంలోని మలం మొత్తం బయటికి వచ్చేస్తుంది. అంటే వ్యర్థాలు శరీరంలో ఇక మిగలవు.

Published By: HashtagU Telugu Desk
Death Facts Human Organs Functioning After Death

Death Facts : మనిషి జీవితానికి విషాద ముగింపు.. మరణం !! ఔనన్నా.. కాదన్నా.. ఇదే చేదు నిజం !! మరణం తర్వాత మనిషి బాడీ మొత్తం చచ్చుబడిపోతుందని చాలామంది  భావిస్తుంటారు. అయితే అది అబద్ధం. మనిషి చనిపోయాక.. బాడీలోని కొన్ని అవయవాలు కొంత సమయం పాటు పనిచేస్తూనే ఉంటాయి. అవి కాసేపు యాక్టివ్‌గా పనిచేస్తాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

చనిపోయాక బాడీలో ఏం జరుగుతుంది ? 

  • మనిషి చనిపోయిన తర్వాత శరీరం బిగుసుకుపోతుంది. బాగా గట్టిపడుతుంది. శరీరంలోని కండరాలు కుచించుకుపోవడం వల్లే  ఇలా జరుగుతుంది.  అయినా కొన్ని కండరాలు పనిచేస్తాయి. చేతులు, కాళ్ల వంటి భాగాల్లో కదలికలు కంటిన్యూ అవుతాయి. ఈవిషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే..  సదరు వ్యక్తి బతికే ఉన్నాడు అనిపిస్తుంది.
  • మనిషి చనిపోయాక(Death Facts) పొట్టలో గ్యాస్ పుడుతుంది. దీనివల్ల శరీరంలోని మలం మొత్తం బయటికి వచ్చేస్తుంది. అంటే వ్యర్థాలు శరీరంలో ఇక మిగలవు.
  • మనిషి చనిపోయాక కూడా జీర్ణాశయంలో బాక్టీరియా బతికే ఉంటుంది. అది జీర్ణాశయం, పేగుల్లో తిరుగుతూ ఉంటుంది. అయితే శరీరంలో చెడు గ్యాస్ తయారవుతున్న కొద్దీ ఆ బాక్టీరియా బయటికి వెళ్లిపోతుంది.
  • మనిషి చనిపోయిన తర్వాత వెంట్రుకలు, గోళ్లూ పెరుగుతూనే ఉంటాయి.
  • మనిషి చనిపోయాక.. స్వరపేటిక కాసేపు పనిచేస్తుంది. దీనికి ఒక కారణం ఉంది. శరీరంలో పుట్టే గ్యాస్, ఊపిరితిత్తులపై ఒత్తిడిని పెంచడం వల్ల.. అక్కడ నిండిన గ్యాస్, నోటి ద్వారా బయటకు వస్తుంది. ఆ సమయంలో చిన్నపాటి శబ్దం గొంతు నుంచి వినిపిస్తుంది.
  • మనిషి చనిపోయాక కూడా.. అతడి బాడీలో ఉన్న చర్మ కణాలు చాలా కాలం పాటు యాక్టివ్‌గానే ఉంటాయి. సాధారణంగానైతే ఆక్సిజన్ అందితేనే చర్మ కణాలు యాక్టివ్‌గా ఉంటాయి. అయితే విచిత్రంగా మనిషి చనిపోయాక..  శరీరం నుంచి ఆక్సిజన్ అందకున్నా చర్మకణాలు బతికే ఉంటాయి. అవి వాతావరణంలోని గాలిని తీసుకొని మనుగడను సాగిస్తాయి. ఖననం చేసిన తర్వాత, మట్టిలోని బ్యాక్టీరియా కారణంగా చర్మకణాలు మట్టిలో కలిసిపోతాయి.
  • చాలామంది గుండెపోటుతో చనిపోతుంటారు.  ఈవిధంగా మనిషి చనిపోయిన తర్వాత కూడా.. కొన్ని నిమిషాలపాటు వారి మెదడు పనిచేస్తూనే ఉంటుంది.  ఈ కొన్ని నిమిషాల వ్యవధినే మనం గోల్డెన్ అవర్ అంటా. ఈ టైంలోగా సదరు వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించి CPR చేయిస్తే.. తిరిగి గుండె కొట్టుకోవడం మొదలుపెట్టొచ్చు. సీపీఆర్ చేస్తే.. మనిషి తిరిగి బతికేలా సహకారాన్ని అందించేందుకు మెదడు ప్రయత్నం చేస్తుంది. శరీరంలోని ఆక్సిజన్, ఇతర పోషకాల్ని గ్రహిస్తూ.. మనిషిని బతికించేందుకు మెదడు యత్నిస్తుంది. ఈక్రమంలో వైద్యులు కొన్ని మందులను రోగికి అందిస్తారు.
  •  ఒకవేళ గర్భవతి చనిపోతే.. ఆమె చనిపోయాక శరీరంలో వాయువులు పుట్టుకొస్తాయి. అవి గర్భంలో ఉన్న బిడ్డను బయటకు పంపుతాయి. గర్భిణీ చనిపోయినా, ఆమె గర్భంలో ఉన్న బిడ్డ చనిపోవడం అనేది సరికాదు అనేది సృష్టి ధర్మం. అందుకే అమ్మ కడుపులోని బిడ్డను బతికించేందుకు సృష్టి సొంతంగా పోరాటం చేస్తుంది.
  • చనిపోయిన వాళ్లకు పోస్ట్‌మార్టం చేసిన తర్వాత..  కొన్నిసార్లు అంగస్తంభన జరుగుతుంది.
  Last Updated: 13 May 2025, 11:16 AM IST