Rice : మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆ అన్నం తింటే చాలు.. షుగర్ కంట్రోల్ లో ఉండడంతోపాటు ఎన్నో లాభాలు?

వైట్ రైస్ (White Rice)లో గ్లైసోమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. నిత్యం వాటిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ పెరుగుతూ ఉంటుంది.

  • Written By:
  • Publish Date - December 18, 2023 / 08:00 PM IST

Rice for Diabetes Patients : మామూలుగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అన్న కూడా కాస్త భయపడుతూ ఉంటారు. వాటి వల్ల షుగర్ పెరిగి ఆరోగ్యానికి ఏమైనా సమస్యలు వస్తాయి ఏమో అని ఆందోళన చెందుతూ ఉంటారు. అలాగే షుగర్ పేషెంట్లను తరచుగా రైస్ (Rice) ఎక్కువగా తినకూడదు అని చెబుతూ ఉంటారు. వీలైనంతవరకు రైస్ చాలా తక్కువగా తినమని చెబుతూ ఉంటారు. ఎందుకంటే అన్నం ఎక్కువగా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. వైట్ రైస్ (White Rice)లో గ్లైసోమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. నిత్యం వాటిని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ పెరుగుతూ ఉంటుంది. అయితే షుగర్ పేషెంట్లు మాత్రం ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక అన్నాన్ని తీసుకుంటే షుగర్ కంట్రోల్ లో ఉండడంతో పాటు మరెన్నో ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఆ అన్నం ఏంటో ఆ అన్నం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

వైట్ రైస్, బ్రౌన్ రైస్ కాకుండా మీరు ఇతర రకాల బియ్యం తీసుకోవచ్చు. శుభవార్త ఏమిటంటే ఈ అన్నాన్ని రోజు తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల బ్లడ్ లో షుగర్ పెరగకుండా కంట్రోల్ లో ఉంటుంది. షుగర్ కంట్రోల్ లో ఉండడం కోసం సామల అన్నం తీసుకోవాలి. ఈ సామల అన్నం ఎలా తయారు చేయాలి అంటే.. ముందుగా సామ బియ్యాన్ని శుభ్రంగా కడిగి వాటిని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని పాన్ లేదా ఓపెన్ పాత్రలో ఉడికించుకోవాలి. మీరు తీసుకున్న అన్నం కంటే ఒక ప్లేట్ తో కప్పి తక్కువ మంటపై ఉడికించుకోవాలి. ఈ బియ్యం మాడిపోకుండా సమానంగా ఉడుకుతుందని తెలుసుకోవడానికి మధ్యమధ్య కలుపుతూ ఉండాలి. అలాగే పప్పు, కూరగాయలు, చట్నీ ఊరగాయతో వాటిని తీసుకోండి.

చాలా రుచిగా ఉంటూ ఉంటుంది. షుగర్ బాధితులు ఈ అన్నం ఎలా తీసుకోవాలి. షుగర్ ఉన్నట్లయితే మీరు నిత్యం వైట్ రైస్ మానేసి వీటికి బదులు కొన్నిసార్లు బ్రౌన్ రైస్ కొన్నిసార్లు సామల రైస్ తీసుకుంటే చాలా మంచిది. సామల బియాన్ని మిల్లెట్ రైస్ అని కూడా పిలుస్తుంటారు. ఇక నిత్యం ఇటువంటి అన్నాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే సామల బియ్యం ఇండెక్స్ 50 కంటే తక్కువ అంటే అవి చాలా వేగంగా గ్లూకోస్ లెవెల్స్ ని పెంచదు దీని మూలంగా బ్లడ్ లో షుగర్ తక్కువగా ఉంటుంది. ఈ బియ్యాన్ని బార్నియార్డ్ మిల్లెట్ అని కూడా అంటారు. దీనిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే పైటో కెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వలన అవి శరీరాన్ని నిర్విష్కరణ చేయడానికి కూడా సహాయపడతాయి. శరీరం నుంచి హానికరమైన అంశాలు అనవసరమైన పదార్థాలను తొలగించుకోవచ్చు. ఈ సామల అన్నాన్ని తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

Also Read:  Garlic Tea: చలికాలంలో అలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే వెల్లుల్లి టీ తాగాల్సిందే?