brain damage ఈ రోజుల్లో జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు, మెదడు బలహీనపడటం, ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్, అనేక ఇతర తీవ్రమైన మెదడు (Brain Damage) సంబంధిత సమస్యలు ప్రజలలో వేగంగా పెరుగుతున్నాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. కానీ, మీరు పాటించే కొన్ని అలవాట్లు మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. ఈ రోజు మనం అలాంటి కొన్ని అలవాట్ల గురించి తెలుసుకుందాం. ఈ అలవాట్లు మనసు లోపల నుండి బలహీనంగా చేస్తాయి. ఈ అలవాట్లను మెరుగుపరచుకోవడం ద్వారా మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని మంచిగా చూసుకోవచ్చు. కాబట్టి ఈ అలవాట్ల గురించి తెలుసుకుందాం. మీరు ఈ అలవాట్లను ఎలా మెరుగుపరచుకోవచ్చనే దాని గురించి కూడా ఈ కథనంలో తెలుసుకుందాం.
వ్యాయామం లేకపోవడం
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శారీరక శ్రమ చేయకపోవడం మీ మానసిక సామర్థ్యాన్ని కూడా బలహీనపరుస్తుంది. ఇది మాత్రమే కాదు మీరు పెద్దవారిగా కనిపించవచ్చు. వ్యాయామం చేయడం ద్వారా ఈ క్షీణతను కొంత వరకు అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల మీరు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే మీ దినచర్యలో వ్యాయామాన్ని చేర్చుకోండి.
చక్కెర, కొవ్వు పదార్థాలు తినడం
ఒక అధ్యయనం ప్రకారం.. మీ గుండెకు హాని కలిగించే విషయాలు మీ మెదడుకు కూడా హాని కలిగిస్తాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తీపి, కొవ్వు అధికంగా తినడం మెదడుకు మంచిది కాదు. దీని వల్ల మెదడు కుంచించుకుపోయి జ్ఞాపకశక్తి బలహీనపడుతుంది. మీ ఆహారంలో స్వీట్లకు బదులుగా కూరగాయలు, తృణధాన్యాలు, చేపలు, ఆలివ్ నూనె మొదలైన వాటిని ఆహారంలో భాగం చేసుకోండి.
Also Read: VVS Laxman: జింబాబ్వే టూర్‌కు గంభీర్ కోచ్ కాదట.. కోచ్‌గా మరో మాజీ ఆటగాడు..!
రోజంతా కూర్చోవడం
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ 2019 అధ్యయనం ప్రకారం.. ఎక్కువసేపు కూర్చోవడం కూడా జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు ప్రతి గంటకు ఐదు నిమిషాలు లేచి నడవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఒకవేళ మీరు రోజంతా కూర్చుంటే మధ్యలో ఒకసారి లేచి నడవండి.
We’re now on WhatsApp. Click to Join.
ఒంటరిగా ఉండకండి
ఒంటరితనం వల్ల ఆలోచించే శక్తి తగ్గిపోయి మెదడు బలహీనంగా మారుతుంది. మరోవైపు బిజీగా ఉండటం కూడా జీవితంలో ఉద్దేశ్యం, అర్థాన్ని కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. అంతే కాకుండా ఇతరులతో సంభాషించడం, ఆలోచనలు మార్చుకోవడం ద్వారా కూడా మనసు చురుకుగా ఉంటుంది.
ఒత్తిడి, రక్తపోటు
తక్కువ, అధిక రక్తపోటు మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. రక్త నాళాలు గట్టిపడటానికి. కుంచించుకుపోయేలా చేస్తుంది. అంతే కాదు మెదడులోని కణాలు, న్యూరోట్రాన్స్మిటర్లలో కూడా మార్పులకు కారణమవుతుంది. కాబట్టి మీ BP 120/80 mmHg కంటే తక్కువగా ఉండేలా చూసుకోవండి. అలాగే ఒత్తిడికి గురికాకండి లేదా ఎక్కువగా చింతించకండి.