Site icon HashtagU Telugu

Cholesterol: కొలెస్ట్రాల్‌ను త‌గ్గించే ఆహార ప‌దార్థాలివే!

Cholesterol

Cholesterol

Cholesterol: గుండె ఆరోగ్యం మీ వంటగది నుంచే మొదలవుతుంది. ఫార్మసీ నుంచి కాదు. ఇది బేరియాట్రిక్, మెటబాలిక్ నిపుణులు చెబుతున్న‌ మాట. కొలెస్ట్రాల్ (Cholesterol) అనేది గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరానికి సరిగా పనిచేయడానికి కొలెస్ట్రాల్ అవసరం. కానీ ఈ కొలెస్ట్రాల్ అవసరం కంటే ఎక్కువగా పెరిగితే అది శరీరానికి హాని కలిగించడం మొదలుపెడుతుంది. ఇది రక్త ధమనులలో పేరుకుపోయి, రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల గుండెకు రక్తం సరిగ్గా చేరక, గుండెపోటు వచ్చే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. అందుకే చెడు కొలెస్ట్రాల్ (Bad Cholesterol)ను సకాలంలో తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. వైద్య నిపుణుల ప్ర‌కారం.. చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే 5 దేశీ ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ప్రయోజనకరమైన ఆహారాలు ఏవో ఇప్పుడు చూద్దాం!

కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఏమి తినాలి?

ధమనులలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించే ఆహారాలు మ‌న‌ వంటగదిలోనే ఉన్నాయని డాక్టర్లు అంటున్నారు. ఈ ఆహారాలు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మెంతి గింజలు

కరిగే ఫైబర్ పుష్కలంగా ఉండే మెంతులు పేగుల్లో LDL అంటే చెడు కొలెస్ట్రాల్‌ను బంధించి, అది శరీరంలోకి శోషించబడకుండా నిరోధిస్తాయి. మెంతులను రాత్రి నానబెట్టి, మరుసటి రోజు ఉదయం వాటిని సేవించాలి.

Also Read: AI Curriculum: ఇక‌పై హైస్కూల్ స్థాయి నుంచే ఏఐ పాఠ్యాంశాలు: మంత్రి లోకేష్

బెండకాయ

మ్యూసిలేజ్ పుష్కలంగా ఉండటం వలన బెండకాయ కొలెస్ట్రాల్‌ను బంధించి, శరీరం నుంచి సులభంగా బయటకు పంపడానికి సహాయపడుతుంది. మ్యూసిలేజ్ అనేది బెండకాయలో ఉండే జిగురు పదార్ధం. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

కొబ్బరి

కొబ్బరి నూనె లేదా కొబ్బరి పొడి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అయితే కొబ్బరిని ఎక్కువగా తీసుకోకుండా, అప్పుడప్పుడు మాత్రమే తినాలి.

యాపిల్

ఫైబర్ పెక్టిన్ ఎక్కువగా ఉండే యాపిల్, జామకాయ, ఉసిరికాయలను తినాల‌ని చెబుతున్నారు. వీటిలో యాంటీ-ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని సేవించడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.

వెల్లుల్లి

రోజుకు 1-2 పచ్చి వెల్లుల్లి రెబ్బలు తింటే కొలెస్ట్రాల్ తగ్గడంలో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. వెల్లుల్లి రక్తపోటు స్థాయిలను కూడా తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్ తగ్గించడానికి

Exit mobile version