Chest burning : ఛాతి భాగంలో నిరంతర మంట (Heartburn) చాలా మంది అనుభవించే ఒక సాధారణ సమస్య. దీన్నే యాసిడ్ రిఫ్లక్స్ లేదా GERD (గ్యాస్ట్రో ఎసోఫేగల్ రిఫ్లక్స్ డిసీజ్) అని కూడా అంటారు. ఇది తరచుగా అన్నవాహికలో ఆమ్లం పైకి రావడం వల్ల వస్తుంది. ఈ మంట అన్నవాహిక గోడలను చికాకు పెడుతుంది. దీంతో ఛాతీ మధ్యలో మండే అనుభూతి కలుగుతుంది. కొన్నిసార్లు ఇది గొంతు వరకు కూడా రావచ్చు.
కారణాలు:
ఈ మంట రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ప్రధానంగా, కడుపులోని ఆమ్లాలు అన్నవాహికలోకి తిరిగి ప్రవేశించకుండా నిరోధించే కండరం (లోయర్ ఎసోఫేగల్ స్పింక్టర్ – LES) బలహీనపడటం వల్ల ఇది జరుగుతుంది. ఇది అధిక బరువు, గర్భిణీ సమయం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడం, ధూమపానం, మద్యం సేవించడం, కాఫీ లేదా టీ ఎక్కువగా తాగడం, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల జరగవచ్చు. కడుపు నిండా తినడం లేదా తిన్న వెంటనే పడుకోవడం కూడా ఈ సమస్యను తీవ్రతరం చేయవచ్చు.
ఉపశమనం కోసం:
ఈ మంటను తగ్గించడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మొదట, మీరు తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మసాలాలు, కొవ్వు పదార్థాలు, పుల్లని పండ్లు, చాక్లెట్, పుదీనా వంటివి తగ్గించండి. చిన్న చిన్న భోజనాలు తరచుగా తీసుకోవడం మంచిది. తిన్న వెంటనే పడుకోకుండా కనీసం 2-3 గంటలు వేచి ఉండండి. తల భాగం కొద్దిగా పైకి ఉండేలా దిండు పెట్టుకుని పడుకోవడం కూడా సహాయపడుతుంది. అవసరమైతే, యాంటాసిడ్లు లేదా ఇతర మందులు తీసుకోవచ్చు. కానీ వైద్యుడి సలహా తప్పనిసరి.
ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు:
ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే తక్కువ కొవ్వు ఉన్న ఆహారాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు (ఓట్స్, తృణధాన్యాలు, కూరగాయలు) తీసుకోవడం మంచిది. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. నీరు ఎక్కువగా తాగండి. వ్యాయామం కూడా చాలా ముఖ్యం. నడవడం, యోగా, సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కానీ, ఆహారం తీసుకున్న వెంటనే తీవ్రమైన వ్యాయామాలు చేయకుండా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్ సమస్యను తగ్గిస్తుంది.
ఈ చిట్కాలు పాటించడం ద్వారా ఛాతీలో మంట సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. అయితే, సమస్య తీవ్రంగా ఉంటే లేదా అదే పనిగా ఇబ్బంది పెడుతుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించి సరైన సలహా తీసుకోవడం ఇంకా మంచిది. ఆలస్యం చేస్తూ దగ్గర దొరికే మెడిసిన్లు మీరే వాడినట్లయితే అది అసిడిటీ, అస్సర్లకు కూడా దారితీయొచ్చు.
Hospitals Bills : ఆస్పత్రులకు షాక్ ఇవ్వనున్న కేంద్రం? ఆర్థిక శాఖ పరిధిలోకి బీమా క్లెయిమ్స్ పోర్టల్!