Lung Cancer: ముఖ భాగంలో లంగ్ క్యాన్సర్ గుర్తించడం ఎలా?

క్యాన్సర్...సైలెంట్ ప్రాణాలు కబళించేస్తోంది. ఈ మహమ్మారి ఏన్నో ఏళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది.

  • Written By:
  • Publish Date - June 1, 2022 / 07:30 AM IST

క్యాన్సర్…సైలెంట్ ప్రాణాలు కబళించేస్తోంది. ఈ మహమ్మారి ఏన్నో ఏళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ప్రతిఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం ప్రపంచాన్ని మరింత కలవరపెడుతోంది. క్యాన్సర్లలో లంగ్ కేన్సర్ కు సంబంధించి లక్షణాలు పెద్దగా బయటకు కనిపించవు. ముందుగా గుర్తిస్తేనే ఈ మహమ్మారి ప్రాణాంతకం కాకుండా చూడవచ్చు.

క్యాన్సర్ ను తొలినాళ్లలో గుర్తించడం చాలా కష్టం. క్యాన్సర్ కణాలు మరింతగా పెరిగిపోయి…విస్తరించిన తర్వాతే ప్రభావాలు బయటకు కనిపిస్తాయి. అప్పటికే అది మూడు లేదంటే నాలుగో దశకు చేరుతుంది. దాంతో ప్రాణాంతకంగా మారుతుంది. అయితే లంగ్ క్యాన్సర్ లో కొన్ని లక్షణాలు ముఖభాగంలో కనిపిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.

అదే పనిగా నొప్పితో బాధపడటం క్యాన్సర్ లక్షణాల్లో మొదటిది. చెవి వెనక భాగంలో టెంపోరియల్ రీజియన్ లో నొప్పి వస్తుంటుంది. అక్కడి నుంచి దవడ భాగానికీ విస్తరిస్తుంది. తలనొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. రెండు చేతులు పైకి ఎత్తినప్పుడు తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. ఇవి లంగ్ క్యాన్సర్ లక్షణాలు అయి ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు. 2018లో కళ్ల చుట్టూ ముఖంపైన వాపుతో ఒక వ్యక్తి డెర్మటాలజిస్ట్ ను సంప్రదించాడు. అతడికి స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఉన్నట్లు బయటపడింది.

ఎందకిలా జరుగుతుంది..?
క్యాన్సర్ పై యాంటీబాడీలు పోరాటం చేస్తుంటాయి. అదే సమయంలో సాధారణ నాడీ సంబంధ కణాలపైనా పొరపాటుగా దాడికి దిగుతుంటాయి. ముఖానికి దారితీసే వెస్సెల్ పైనా క్యాన్సర్ కారణంగా ఏర్పడిన కణతి నుంచి ఒత్తిడి వ్యాప్తిస్తుంటుంది. దీంతో నొప్పితోపాటు వాపు కూడా కనిపిస్తుంది. తల, మెడ, క్యాన్సర్ ఉన్న వారిలో 80శాతం మందికి ముఖంపై నొప్పులు, వాపులు కనిపిస్తుంటాయి. ఇక లంగ్ క్యాన్సర్ తోపాటు ఈ లక్షణాలతోపాటు లంగ్స్ చుట్టూ నీరు చేరడం, ఇన్ఫెక్షన్లు, రక్తంలోక్లాట్, క్యాల్షియం స్థాయిలు పెరగడం వెన్ను నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.