Site icon HashtagU Telugu

Fish in Winter : చలికాలంలో చేపలు తినవచ్చా..? తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

Can You Eat Fish In Winter.. Do You Know What Happens If You Eat It..

Can You Eat Fish In Winter.. Do You Know What Happens If You Eat It..

Eating Fish in Winter? : చలికాలం మొదలయింది అంటే చాలు ఎన్నో రకాల సీజనల్ వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. విపరీతమైన చలి కారణంగా చాలామంది ఇంట్లో నుంచి బయటికి రావాలి అంటేనే భయపడుతూ ఉంటారు. అయితే చలికాలంలో ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవాలి. చలికాలంలో కాలానికి అనుగుణ వ్యాధులు తగ్గించడంలో చేపలు (Fish) ఎంతగానో మేలు చేస్తాయి. చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండడం వల్ల అవి ఎన్నో రకాల వ్యాధులను తగ్గిస్తాయి. అయితే చాలామంది చలికాలం చేపలు (Fish) తినకూడదు అని అపోహ పడుతూ ఉంటారు. ఆ విషయం గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

చలికాలంలో తరచుగా జలుబు, దగ్గులు సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. శ్వాస సంబంధిత సమస్యలతో కూడా ఇది తన ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ లో చాలా ప్రభావంతంగా పనిచేస్తూ ఉంటుంది. చేపలు తీసుకోవడం వలన శరీరంలోని అవసరమైన ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ లోపాల్ని తగ్గిస్తుంది. ఇది కంటిచూపుని మెరుగుపరుస్తుంది. ప్రధానంగా చలికాలంలో ట్యూనా ఫిష్ సల్మాన్ మెటీరియల్ చాలా ముఖ్యం. చల్లని వాదాల్లో చర్మ సమస్యలు పెరగడం మొదలవుతుంటాయి. ఈ సమయంలో చర్మం పొడిగా అవుతూ ఉంటుంది. అలాగే చర్మం వచ్చేలా చేస్తుంది. ఈ చేపల్లో ఉండే ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ గ్లోను తిరిగి తీసుకురావడంలో ఉపయోగపడతాయి.

దీనిలో ఉండే విటమిన్లు మినరల్స్ తో పాటు విటమిన్ బి12 ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా క్యాన్సర్ లాంటి పెద్ద వ్యాధుల నుండి బయటపడేస్తుంది. ఇటువంటి పోషకాలు సల్మాన్ ఫిష్ లో ఉంటాయి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచడంలో ఉపయోగపడతాయి. ఒమేగా త్రీ అధిక కొలెస్ట్రాల్ పై ప్రభావం చూపుతూ ఉంటుంది. అలాగే గుండె జబ్బుల్ని నుంచి బయటపడేస్తుంది. ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మెదడు కూడా చాలా మంచి చేస్తాయి. దీని తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇది కాకుండా శరీరంలో వచ్చే వాపులు తగ్గించడంలో గొప్పగా పనిచేస్తాయి. కాబట్టి చలికాలంలో చేపలు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తప్ప అనారోగ్య సమస్యలు కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. చలికాలంలో చేపలు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరతాయి.

Also Read:  Health Tips: శీతాకాలంలో అలాంటి సమస్యలు రాకూడదంటే.. ఈ డ్రింక్ తాగాల్సిందే?