Site icon HashtagU Telugu

Cabbage Fry : కరకరలాడే క్యాబేజీ ఫ్రై.. సింపుల్ ఇలా చేసేయండి..

crispy cabbage fry

crispy cabbage fry

Cabbage Fry : క్యాబేజ్.. మనలో చాలా మందికి ఇది నచ్చదు. క్యాబేజ్ ను కట్ చేసి ఉడకబెట్టేటపుడు వచ్చే వాసననే తట్టుకోలేకపోతుంటారు. ఇక తినడం అంటే.. మా వల్ల కాదంటారు. కానీ.. అదే క్యాబేజ్ ను బర్గర్, ఫ్రైడ్ రైస్, నూడుల్స్ వంటి వాటిలో వేస్తే మాత్రం ఎంచక్కా తింటారు. ఇంట్లో వండే క్యాబేజ్ కూర తినాలంటే మాత్రం గొంతుదిగదు. ఇక అమ్మ తిట్లు పడలేక తప్పనిసరిగా తింటారు కొందరు. ఇంట్లో క్యాబేజ్ తో కూరలే తప్ప.. ఫ్రై చేయరు. ఎందుకంటే అది చాలా ప్రాసెస్ అని. కానీ.. పప్పుచారు, పప్పు, సాంబార్ వంటి వాటిలో క్యాబేజ్ క్రిస్పీ ఫ్రై తింటే.. భలే ఉంటుంది. మరి ఇంట్లోనే సింపుల్ గా క్యాబేజ్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి.

క్యాబేజ్ ఫ్రై కి కావలసిన పదార్థాలు

క్యాబేజ్ – మీడియం సైజుది ఒకటి
పచ్చిమిర్చి – ఐదు లేదా ఆరు
కరివేపాకు – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా
కారం – 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
బియ్యంపిండి – అరకప్పు
మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు
బొంబాయి రవ్వ – ఒక కప్పు
నూనె – డీప్ ఫ్రై కి సరిపడా

క్రిస్పీ క్యాబేజ్ ఫ్రై తయారీ విధానం

ముందుగా అరముక్క క్యాబేజ్ ను సన్నగా తరిగి పెట్టుకోవాలి. కరివేపాకుని తుంచుకుని, పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని పెట్టుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ లో ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి క్యాబేజి ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు బియ్యంపిండి, మొక్కజొన్న పిండి, బొంబాయి రవ్వ వేసుకుని, కొద్దిగా నీరు పోసి గట్టిపకోడి పిండి మాదిరిగా కలుపుకోవాలి. చివరిలో కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉండానే ఉండాలి.

ఇప్పుడు కళాయిలో నూనె పోసి.. వేడయ్యాక కలిపిపెట్టుకున్న పిండిని పకోడిలా విడివిడిగా వేసుకోవాలి. మొదట కాస్త మెత్తగా ఉన్నా.. వేగే కొద్దీ.. క్రిస్పీగా ఉంటుంది. వేపుడు మరీ మాడిపోయేలా కాకుండా.. డార్క్ రెడ్ కలర్ వచ్చేంత వరకూ వేయించాలి. వేగిపోయిన పకోడీని ఒక ప్లేట్ లోకి తీసుకుని కొద్దిగా మిరియాలపొడి, చాట్ మసాలా చల్లుకుని తింటే.. టేస్ట్ సూపర్ గా ఉంటుంది.

Also Read : Thamalapaku Rasam : తమలపాకులతోనూ ఇలా రసం చేసుకుని.. అన్నంలో తినొచ్చు !