Site icon HashtagU Telugu

Breast Cancer: మ‌హిళ‌ల‌కు బ్రెస్ట్ క్యాన్స‌ర్ ఉందో.. లేదో? నిమిషంలో తెలుసుకోవ‌చ్చు.. ఎలాగంటే..?

Breast Cancer

Breast Cancer

Breast Cancer: “రొమ్ము క్యాన్సర్” మహిళల్లో చాలా పెద్ద సమస్యగా మారింది. దాని చికిత్స కోసం సకాలంలో సమాచారాన్ని కలిగి ఉండటం ముఖ్యం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దేశవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) కేసులు పెరుగుతున్నాయి. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించనప్పుడు, చికిత్స ఆలస్యం అయినప్పుడు ప్రాణాంతకం అవుతుంది. రొమ్ము క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డామని మహిళలకు తెలియనప్పుడు ఇలాంటి ఉదంతాలు చాలానే కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

1 నిమిషంలో రొమ్ము క్యాన్సర్‌ని గుర్తించడం

బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం రాబోతోంది. నిజానిక మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో కేవలం 1 నిమిషంలో చెప్పే బ్రా తయారు చేస్తున్నారు నిపుణులు. కాన్పూర్ ఐఐటీలో బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే బ్రాను అభివృద్ధి చేశారు. పరిశోధకుడి ప్రకారం.. ఈ బ్రా ధరించడం ద్వారా ఒక మహిళ తనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో 1 నిమిషంలో తెలుసుకోవచ్చు.

కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన బ్రాను తయారు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రత్యేక పరికరం ఇంకా మార్కెట్‌లో అందుబాటులో లేదని ఐఐటీ నిపుణులు పేర్కొన్నారు. కాన్పూర్ ఐఐటీకి చెందిన రీసెర్చ్ ఫెలో శ్రేయా నాయర్ ఈ స్మార్ట్ బ్రాను సిద్ధం చేశారు. రొమ్ము క్యాన్సర్ లక్షణాల గురించి చాలాసార్లు మహిళలకు తెలియదని చెప్పారు. దాని కారణంగా స్మార్ట్ బ్రాను తయారు చేయాలని భావించి.. 1 సంవత్సరంలో దానిని సిద్ధం చేశారు.

Also Read: 2024 Paris Olympics : పీవీ సింధు కట్టిన చీరపై వివాదం

స్మార్ట్ బ్రా ప్రత్యేకత ఏమిటి?

స్మార్ట్ బ్రా ఎలా పని చేస్తుంది?

నిజానికి బ్రా లోపల ధరించే పరికరాన్ని IIT కాన్పూర్- KGMU నిపుణులు సంయుక్తంగా తయారు చేశారు. పోర్టబుల్ పరికరం కావడంతో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. మొబైల్ యాప్‌ని స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ చేయడం ద్వారా మీరు ఈ పరికరాన్ని స్మార్ట్ వాచ్‌గా ఉపయోగించగలరు. ఈ పరికరాన్ని బ్రా లోపల ధరిస్తారు. ఇది ప్రతిరోజూ మహిళ రొమ్ముకు సంబంధించిన డేటాను సేకరించి క్యాన్సర్ లక్షణాలను గుర్తిస్తుంది. రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించమని కూడా పరికరం మీకు సలహా ఇస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

రొమ్ము క్యాన్సర్ గుర్తింపు స్మార్ట్ బ్రా ధర..?

ప్రస్తుతం రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడానికి ఈ పరికరం క్లినికల్ టెస్టింగ్ జరుగుతోంది. ఇది మార్కెట్‌లోకి రావడానికి మ‌రికొంత కాలం పట్టవచ్చు. ధర గురించి చెప్పాలంటే బ్రెస్ట్ క్యాన్సర్‌ను గుర్తించే స్మార్ట్ బ్రా ధర రూ.5 వేల వరకు ఉంటుంద‌ని అంచ‌నా.