Site icon HashtagU Telugu

Brazil Nuts : బ్రెజిల్ నట్స్ లో ఉండే పోషక విలువలు గురించి మీకు తెలుసా ?

Brazil Nuts Benefits

Brazil Nuts Benefits

బరువు తగ్గేందుకు, శరీర ఆకృతిని కంట్రోల్ లో ఉంచేందుకు, ఆరోగ్యం కోసం డైట్(Diet) చేసేవారు ప్రతిరోజూ డ్రైఫ్రూట్స్(Dry Fruits) తీసుకుంటారు. చాలామంది కిస్మిస్, కాజు, బాదం, ఖర్జూరం వంటివే కాకుండా కొన్ని నట్స్ కూడా తింటారు. వాటిలో బ్రెజిల్ నట్స్(Brazil Nuts) కూడా ఒకటి. ఈ గింజలలో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, సెలీనియం, మెగ్నీషియం, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కడుపులో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

చూడటానికి పనస గింజలలాగా ఉండే బ్రెజిల్ నట్స్ అమెజాన్ ఫారెస్ట్ లో ఎక్కువగా లభిస్తాయి. బ్రెజిల్ నట్స్ ను అధికంగా కేకులు, కుకీలు, బ్రెడ్ వంటి వాటిపై వాడుతుంటారు. బేకరీల్లో లభించే తినుపదార్థాల్లో వీటిని చూస్తుంటాం. ఈ బ్రెజిల్ నట్స్ శరీరానికి పెద్దమొత్తంలో పోషకాలను అందిస్తాయి. సుమారు 6 బ్రెజిల్ నట్స్ లో 185 కేలరీలు, 4 గ్రాముల ప్రొటీన్, 3 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 19 గ్రాముల కొవ్వు, 7.5 గ్రాముల ఫైబర్, పొటాషియం, కాల్షియం ఉంటుంది. వీటిలో అసంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శరీరంలో కొవ్వును తగ్గించి, గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి.

బ్రెజిల్ నట్స్ లో ఉండే సెలీనియం రోగనిరోధక వ్యవస్థను పెంచడంతో పాటు థైరాయిడ్ గ్రంథి పనితీరును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది.

బ్రెజిల్ గింజల్లో ఉండే.. మెగ్నీషియం ఎముకలు, కండరాల పనితీరుకు సహాయపడుతుంది. శరీరంలో పేరుకున్న కొవ్వులను కరిగించడంతో పాటు వాపు తగ్గుతుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది.

అయితే బ్రెజిల్ గింజలను చాలా మితంగా తినాల్సి ఉంటుంది. అధికంగా తీసుకుంటే వాటిలో ఉండే సెలీనియం టాక్సిసిటీకి దారితీయవచ్చు. ఫలితంగా జుట్టురాలడం, అలసట పెరగడం జీర్ణాశయాంతర సమస్యలను కలిగించవచ్చు. రోజుకు రెండు బ్రెజిల్ నట్స్ కు మించి తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

 

Also Read :  Benefits of Ghee : ప్రతిరోజూ నెయ్యి తింటే.. ఎన్ని ప్రయోయోజనాలు ఉన్నాయో తెలుసా?

Exit mobile version