Site icon HashtagU Telugu

Food in Periods : పీరియడ్స్ సమయంలో మహిళలు తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే..

Best Food in Periods Time for Women

Best Food in Periods Time for Women

పీరియడ్స్(Periods) అనగానే మహిళలకు కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, పొట్టలో నొప్పి ఇంకా రకరకాల నొప్పులు వస్తుంటాయి. ఇంకా ఏమి పని చేసినా లేదా చేయకపోయినా ఎక్కువగా అలసటకు గురవుతారు, మానసికంగా అనారోగ్యానికి గురవుతారు. ఈ అలసటను తగ్గించుకోవడానికి కొన్ని రకాల ఆహారపదార్థాలను(Food) తినాలి. ఇవి పీరియడ్స్ సమయంలో ఆడవారికి శక్తిని అందిస్తాయి.

ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలను తినాలి. ఆడవారికి పీరియడ్స్ సమయంలో రక్తం ఎక్కువగా పోతుంది. కాబట్టి ఆకుకూరలు రక్తాన్ని తిరిగి నింపే పనిని మొదలుపెడతాయి.

అల్లం తినడం వలన పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని మంటను తగ్గిస్తాయి. పీరియడ్స్ సమయంలో డార్క్ చాక్లెట్ తినడం వలన అవి మన మూడ్ ను మారుస్తాయి. మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తాయి.

పీరియడ్స్ సమయంలో మార్కెట్ లో లభించే బెర్రీ జాతి పండ్లను తినడం వలన పొట్ట ఉబ్బరం, అలసటను తగ్గిస్తాయి. బత్తాయి, నిమ్మ, నారింజ తినడం వలన అవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మన శరీరంలో ఐరన్ స్థాయిని పెంచుతాయి.

పీరియడ్స్ సమయంలో రోజూ ఉదయం కొన్ని నట్స్ తినాలి పిస్తా, బాదం, గుమ్మడి గింజలు తినాలి. వీటిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవి తినడం వలన పీరియడ్స్ సమయంలో మనకు వచ్చే పొట్ట నొప్పిని తగ్గిస్తుంది.

అరటిపండును పీరియడ్స్ సమయంలో తినడం వలన రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మానసిక ఆందోళనను, కడుపులో నొప్పిని తగ్గిస్తుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో తినే ఆహారపదార్థాలలో పైన చెప్పిన వాటిని చేర్చుకోండి. దాని వలన పీరియడ్స్ సమయంలో కలిగే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది.

 

Also Read : Control Anger : కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎలాగో తెలుసా?