Sweet Potato : చలికాలంలో చిలకడదుంప తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా?

ఆరోగ్యపరంగా చిలకడదుంప ఎంతో మంచిది. చిలకడదుంపను తినడం వలన మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

  • Written By:
  • Publish Date - November 4, 2023 / 05:00 AM IST

చిలకడదుంప(Sweet Potato) ఎక్కువగా చలికాలంలో(Winter Season) వస్తుంటాయి. వీటిని ఈ కాలంలో తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. చిలకడదుంపలను డైరెక్ట్ గా ఉడికించుకొని తినవచ్చు లేదా కాల్చుకొని తినవచ్చు. అలాగే కూర, ఫ్రై, సాంబార్ లో కూడా వాడుకోవచ్చు. ఉడికించుకొని తింటేనే ఎక్కువ రుచిగా ఉంటాయి. ఇది తియ్యగా, రుచిగా కూడా ఉంటుంది. పిల్లలకు సాయంత్రం సమయంలో స్నాక్స్ కింద దీనిని పెట్టవచ్చు. ఆరోగ్యపరంగా చిలకడదుంప ఎంతో మంచిది. చిలకడదుంపను తినడం వలన మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

* చిలకడదుంపలో మన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే లక్షణాలు ఉంటాయి కాబట్టి చలికాలంలో మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
* చలికాలంలో మన చర్మం తొందరగా పొడిబారుతుంది. చిలకడదుంప మన శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ తో పోరాడి మన చర్మాన్ని కాపాడుతుంది. చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది.
* చిలకడదుంపలో ఉండే మెగ్నీషియం ఒత్తిడికి వ్యతిరేకంగా పోరాడుతుంది. మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
* చిలకడదుంప తినడం వలన అది మన శరీరానికి వెంటనే శక్తిని కలిగిస్తుంది. అందుకే పూర్వకాలంలో చలికాలంలో ఉపవాసం ఉంటె శక్తి కోసం చిలకడ దుంప తినేవారు.
* చిలకడదుంప మన శరీరంలో బిపి ని కంట్రోల్లో ఉంచుతుంది.
* చిలకడదుంపలో ఉండే పొటాషియం మన శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తిని పెంచుతుంది. * చిలకడదుంప మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
* చిలకడదుంపలో ఉండే విటమిన్ సి మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుతాయి.

కాబట్టి ఈ కాలంలో విరివిగా దొరికే ఈ చిలకడ దుంపని వదలకుండా తినండి, మీ పిల్లలకు కూడా తినిపించండి.

 

Also Read : SpringRolls : ఇంట్లోనే బేకరీ స్టైల్ స్ప్రింగ్ రోల్స్ తయారుచేయండిలా..