Site icon HashtagU Telugu

Panasa Tonalu : ఎండాకాలం పనస తొనలు తినండి.. బోలెడన్ని ఉపయోగాలు..

Benefits of Panasa Tonalu Jack Fruit

Benefits of Panasa Tonalu Jack Fruit

ఎండాకాలంలో(Summer) విరివిగా లభించే పండ్లలో పనస తొనలు(Jack Fruit) ఒకటి. పనస తొనలు పండినవి తింటే ఎంతో రుచిగా ఉంటాయి అంతేకాకుండా వీటిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి పనసతో బిర్యానీ కూడా చేస్తారు. పనస పొట్టు కూర, పనస తొనల హాల్వా, పనస గింజల కూర.. ఇలా అనేక రకాలు చేసుకొని తినొచ్చు. ఇతర పండ్లతో పోలిస్తే పనస తొనలలో విటమిన్లు, ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి.

* పనస తొనలలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు శరీరంలోని కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
* పనస తొనలలో ఉండే విటమిన్ సి ఎండాకాలంలో చర్మం, జుట్టును కాపాడుతుంది. మన శరీరంలో వ్యాధి నిరోధకశక్తిని పెంచుతుంది.
* పనస తొనలలో ఉండే ఫైటోన్యూట్రియంట్స్ క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి.
* పనస తొనలలో ఉండే ఐరన్ ఎనీమియా (రక్తహీనత) ను తగ్గిస్తుంది.
* పనస తొనలలో ఉండే ఖనిజాలు, లవణాలు థైరాయిడ్ గ్రంధిని కాపాడతాయి. ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి.
* పనస తొనలలో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి మంచిది.
* పనస తొనలలో ఉండే కాల్షియం ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది.
* పనసతొనలలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ సక్రమంగా జరిగి మలబద్దకాన్ని నిరోధిస్తుంది.
* పనస తొనలు తినడం వలన అధిక బరువు కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది.
* పనస తొనలు తినడం వలన కూడా బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉండడానికి సహాయపడుతుంది.

 

Also Read :  Wrinkles: ముఖంపై వచ్చే మడతలకు బంగాళదుంపతో చెక్.. ఇలా చేయండి..!