సీమసింతకాయలను(Manila Tamarind) గుబ్బకాయలు, పులిచింతకాయలు అని కూడా అంటారు. సీమసింతకాయలు అంటే ఇప్పటి పిల్లలకి ఎవరికీ పెద్దగా తెలియదు కానీ పెద్దవారికి, పల్లెటూరిలో ఉండే వారికి బాగా తెలుసు. సీమసింతకాయలు ఎండాకాలంలో వస్తాయి. ఇవి పొలాల్లో పొలం గట్ల మీద పల్లెటూళ్ళో బాగా దొరుకుతాయి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు తెల్లగా పండినాక లేత గులాబీ రంగులో ఉంటాయి. పండినవి తియ్యగా ఉంటాయి. ఇవి డైరెక్ట్ గా కూడా తినొచ్చు. అయితే పచ్చి సీమసింతకాయలతో చేసే ఫ్రై బాగుంటుంది.
పచ్చి సీమచింతకాయల ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసా?
కావలసిన పదార్థాలు:-
* పచ్చి సీమసింతకాయలు పావుకిలో
* ఉల్లిపాయలు రెండు పెద్దవి
* పచ్చిమిర్చి నాలుగు
* ఉప్పు తగినంత
* కారం తగినంత
* వెల్లుల్లి పాయలు నాలుగు
* గుడ్డు ఒకటి
* తాలింపు గింజలు కొన్ని
* కరివేపాకు కొద్దిగా
*నూనె కొద్దిగా
ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలి. వెల్లుల్లిపాయలను దంచుకొని ఉంచుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. సీమసింతకాయలను గింజలు తీసేసి ఉంచుకోవాలి. మొదట ఒక మూకుడును పొయ్యి మీద పెట్టి దానిలో తాలింపు వేసి తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసి వేగనివ్వాలి. వేగిన తరువాత గింజలు తీసిన సీమసింతకాయలను వేసి మగ్గనివ్వాలి. తరువాత గుడ్డును పగలగొట్టి దానిలో వేయాలి అది కూడా వేగిన తరువాత సరిపడ ఉప్పు, కారం వేసి కలపాలి. ఇక సీమసింతకాయల ఎగ్ ఫ్రై తయారైనట్లే. సిమా సింతకాయలు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. కాబట్టి సమ్మర్ లో దొరికే ఈ సీమ సింతకాలయను కచ్చితంగా తినండి.
Also Read : Soaked Mango Benefits: ఏంటి! నానబెట్టిన మామిడికాయతో అన్ని రకాల ప్రయోజనాలా?