Site icon HashtagU Telugu

Jeelakarra : వంటల్లో వేసే జీలకర్ర.. మహా ఔషధం.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా??

Benefits of Jeelakarra for Health

Benefits of Jeelakarra for Health

జీలకర్ర(Jeelakarra).. ప్రతి వంటింట్లో ఉండే ముఖ్యమైన తాలింపు దినుసుల్లో ఇదీ ఒకటి. ఇది లేకపోతే చాలా రకాల వంటకాలకు రుచే ఉండదు. జీలకర్ర శాస్త్రీయ నామం క్యుమినియం సైమినమ్. ఇది అంబెల్లి ఫెరె కుటుంబానికి చెందినది. తూర్పు మధ్యదరా, ఈజిప్టులో(Egypt) వేల సంవత్సరాలుగా జీలకర్రను సాగుచేస్తున్నారు. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి వంటి పోషకాలు లభిస్తాయి. జీలకర్రలోనూ రకాలున్నాయి. నల్ల జీలకర్ర, తెల్లజీలకర్ర, షాజీరా, ఆకుపచ్చ జీలకర్ర ఇలాంటివి ఉన్నాయి. షాజీరాను ఎక్కువగా మసాలా కూరల్లోనూ, బిర్యానీలో వినియోగిస్తారు.

జీలకర్ర వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే మన పెద్దలు అది ప్రతి వంటకంలో ఉండేలా చేశారు.

1.జీలకర్రలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి ఉన్నాయి. వీటిలో ఉండే ఐరన్ హిమోగ్లోబిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కాల్షియం ఎముకలు, దంతాల నిర్మాణాలను బలపరుస్తుంది.

2. వీటిలో ఉండే మెగ్నీషియం కండరాలు, నరాల పనితీరును నిర్వహించేందుకు, రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటును నియంత్రించేందుకు అవసరమవుతాయి.

3. జీలకర్రలో ఉండే విటమిన్ బి ఆరోగ్యకరమైన మెదడు పనితీరు, ఎర్ర రక్తకణాల ఉత్పత్తి, శక్తి జీవక్రియను నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

4.వీటితో పాటు జీలకర్ర గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలతో అనే ప్రయోజనాలున్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగు పరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

5. జీలకర్రలో లాలాజల గ్రంధులను ఉత్తేజపరిచే ఆరోగ్యానికి ఉపయోగకరమైన నూనెలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణ ఎంజైమ్ ల స్రావాన్ని కూడా పెంచుతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి.

6.ప్రతిరోజూ కొంచెం జీలకర్ర తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి కంట్రోల్ లో ఉంటుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారు ప్రతిరోజూ ఒక స్పూన్ జీలకర్ర తినడం మంచిది.

7.అలాగే ఇవి ఆకలిని నియంత్రించి జీవక్రియను పెంచుతాయి. ఫలితంగా బరువు తగ్గడంలో సహాయపడతాయి.

8. జీలకర్రను డైరెక్ట్ తినడమే కాకుండా.. సూప్ లు, సలాడ్ లలో కూడా తీసుకోవచ్చు. రాత్రివేళ జీలకర్రను గ్లాసు నీటిలో నాన బెట్టి, ఉదయాన్నే ఆ నీటిని మరిగించి అందులో ఒక స్పూన్ తేనె కలుపుకుని తాగడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గడంతో పాటు బరువు కూడా తగ్గుతారు.

 

Also Read :  Chia Seeds : లైంగిక సామర్థ్యాన్ని పెంచే చియా సీడ్స్.. ఎలా వాడాలో తెలుసా?