Evening Walk : సాయంత్రం సమయంలో వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

కొంతమంది ఉదయం సమయం లేకపోవడం వలన సాయంత్రం సమయంలో వాకింగ్ చేస్తుంటారు. అయితే మనం ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా వాకింగ్ చేయవచ్చు.

Published By: HashtagU Telugu Desk
Benefits of Evening Walk must know facts

Benefits of Evening Walk must know facts

మామూలుగా అయితే ఉదయం(Morning) సమయంలో వాకింగ్(Walking) చేస్తాము. కానీ కొంతమంది ఉదయం సమయం లేకపోవడం వలన సాయంత్రం(Evening) సమయంలో వాకింగ్ చేస్తుంటారు. అయితే మనం ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా వాకింగ్ చేయవచ్చు. వాకింగ్ కొత్తగా మొదలు పెట్టేవారు మొదట పావుగంట సేపు నడవాలి. మొదట నిదానంగా నడవాలి మన శరీరం నడకకు అలవాటు పడిన తరువాత స్పీడ్ పెంచాలి. కానీ నడక నడిచేటప్పుడు ఒక సరైన పద్దతిని అనుసరించాలి.

ఒక వారం రోజుల పాటు పావుగంట సేపు నడిచిన తరువాత ఇంకొక పది నిముషాల సమయం నడవడానికి పెంచుకోవాలి. ఇలా వారం వారం పది నిముషాల చొప్పున సమయాన్ని పెంచుకుంటూ గంట సేపు నడవచ్చు. ఈ విధంగా నడవడం వలన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధంగా నడవడం వలన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. సాయంత్రం వాకింగ్ చేసే సమయంలో ఎక్కువగా అలసిపోయినట్లు అనిపిస్తే మాత్రం మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇంకా అలసటగా అనిపిస్తే రెండు లేదా మూడు గ్లాసులు నీళ్ళు తాగవచ్చు.

సాయంత్రం సమయంలో వాకింగ్ చేసేటప్పుడు మనకు అనుగుణంగా ఉండే షూస్, డ్రెస్ వేసుకుంటే ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇంకా కొద్దిసేపు నడిచిన తరువాత ఇబ్బందిగా అనిపిస్తే కాసేపు గట్టిగా శ్వాస తీసుకొని వదలాలి. దీని వలన మనకు రిలీఫ్ గా అనిపిస్తుంది. సాయంత్రం సమయంలో నడవడం వలన రాత్రి పూట ప్రశాంతంగా నిద్ర పడుతుంది. కండరాలపై పడిన నొప్పిని సాయంత్రం నడక తగ్గిస్తుంది. నడక వలన మన శరీరంలోని అన్ని కండరాలు ఉతేజంగా ఉండి వ్యాధి నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోజూ సాయంత్రం సమయంలో నడవడం వలన మనలోని నిరుత్సాహం పోయి చురుకుదనం వస్తుంది.

 

Also Read : Ulcer: ఈ వంటింటి చిట్కాలతో నోటిపూతకు చెక్ పెట్టండిలా?

  Last Updated: 01 Jun 2023, 12:30 PM IST