Watter Apple : మనం రోజూ ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు అని అంటారు. అంటే యాపిల్ ఆరోగ్యానికి అంత మంచిది అని. అలాగే వాటర్ ఆపిల్ తినడం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. వాటర్ ఆపిల్స్ ని జంబోరా పండు, గులాబ్ జామూన్, బెల్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఇది ఇండియాలో ఎక్కువగా పండకపోయినా కొన్ని ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ వాటర్ ఆపిల్ డైరెక్ట్ గా తినొచ్చు, జ్యూస్, సలాడ్ వంటివి కూడా చేసుకొని తినవచ్చు.
వాటర్ యాపిల్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..
* వాటర్ ఆపిల్ తినడం వలన మనకు డీ హైడ్రేషన్ సమస్య ఉండదు.
* వాటర్ ఆపిల్ మన శరీరానికి కావలసిన విటమిన్లు, కాల్షియం, ఐరన్, పీచు, మెగ్నీషియం, పొటాషియంను అందిస్తాయి.
* మన జుట్టు దృడంగా పెరగడానికి, వెంట్రుకలు ఎక్కువగా రాలకుండా ఉండడానికి సహాయపడతాయి.
* మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి ఊబకాయం రాకుండా చేస్తుంది.
* కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తాయి.
* గర్భిణీ స్త్రీలు వాటర్ ఆపిల్ ను తినడం వలన అన్ని రకాల పోషకాలు అందుతాయి.
* వాటర్ ఆపిల్ తినడం వలన మన శరీరం లోని హానికరమైన పదార్థాలు ఏమైనా ఉంటే అవి మూత్రం లేదా చెమట ద్వారా బయటకు పోతాయి.
* జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది, మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది.
* చర్మం పైన మచ్చలు ఏమైనా ఉంటె తగ్గుతాయి. చర్మ సంరక్షణకు సహాయపడతాయి.
* కీళ్ళ నొప్పులను తగ్గిస్తాయి.
* మన శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుతాయి.
అందుకే మీకు మార్కెట్ లో వాటర్ యాపిల్ కనిపిస్తే కొనుక్కొని తినండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి.
Also Read : Vitamin E Capsule: ముఖానికి విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!