మెంతులు(Fenugreek Seeds)మనం పలు వంటకాలలో వాడుతుంటాము. మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగి, ఆ మెంతులను తినొచ్చు. దీని వలన ఆరోగ్యంగా ఉంటారు. మెంతులు పీచు, ఖనిజాలు, అనేక పోషకాలు కలిగి ఉన్నాయి. ఒక స్పూన్ మెంతులలో ఇరవై శాతం ఇనుము, ఏడు శాతం మాంగనీస్, ఐదు శాతం మెగ్నీషియం ఉంటాయి.
మెంతులు మన ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు..
* మెంతులు తినడం వలన మనకు పొట్ట తొందరగా నిండినట్లు అనిపిస్తుంది. దీని వలన తొందరగా బరువు తగ్గుతారు.
* మెంతులు మన శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేలా చేస్తాయి.
* మెంతులు తినడం వలన గుండెలో మంట వంటివి కూడా తగ్గుతాయి.
* మెంతులు రక్తహీనతను తగ్గిస్తాయి.
* మెంతులు ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన బాలింతలలో పాల ఉత్పత్తి పెరుగుతుంది.
* మెంతులు ఆహారంలో భాగంగా తీసుకుంటే పురుషులలో టెస్టోస్టిరాన్ స్థాయిని పెంచుతాయి.
* మెంతులు తినడం వలన అవి మన శరీరం చెడు కొలెస్ట్రాల్ ను ఉత్పత్తి చేయడం తగ్గిస్తుంది.
* మెంతి గింజలలో ఉండే శ్లేష్మం మన శరీరంలో జీర్ణశయాంతర చికాకును తగ్గిస్తుంది.
* మెంతులు తినడం వలన అవి మన శరీరంలోని కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది.
* మెంతులు హైపర్ గ్లైసీమిక్ సెట్టింగ్ లలో ఇన్సులిన్ సెన్సిటివిటిని పెంచుతాయి.
మెంతులు ఆయుర్వేదంలో కూడా అనేక ప్రాధాన్యత ఉంది. మెంతులను చాలా రోగాలకు ఔషధంగా కూడా వాడతారు. అందుకే మెంతులను ఆహారంలో భాగం చేసుకోండి.
Also Read : Mint Leaves : పుదీనా తినండి.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?