Cardamom Tea : వర్షాకాలంలో యాలకుల టీ తాగితే ఎంత మంచిదో తెలుసా..

ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తాయి కాబట్టి ఈ కాలంలో యాలకుల టీ(Cardamom Tea) తాగడం మంచిది.

  • Written By:
  • Publish Date - July 31, 2023 / 10:30 PM IST

వర్షాకాలం(Rainy Season) మొదలయి ఫుల్ గా వానలు(Rains) కురుస్తున్నాయి. వర్షాకాలంలో చాలామంది టీ(Tea) తాగాలని అనుకుంటారు. చల్లగా చినుకులు పడుతుంటే కచ్చితంగా వేడి వేడి టీ సిప్ చేయాలని భావిస్తారు. వర్షకాలంలో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తాయి కాబట్టి ఈ కాలంలో యాలకుల టీ(Cardamom Tea) తాగడం మంచిది. మిరియాల పాలు తాగడం వలన కూడా జలుబు, దగ్గు, జ్వరం వంటివి తగ్గుతాయి.

యాలకుల టీ వర్షాకాలంలో చాలా మంచిది. ఇందులో మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ b6 అధికంగా ఉన్నాయి. యాలకుల టీ తాగడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. యాలకుల టీ తాగడం వలన జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. తలనొప్పి, అలసట వంటివి కూడా తగ్గుతాయి. యాలకుల టీలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటె తగ్గుముఖం పడతాయి. యాలకుల టీ తాగడం వలన ఒత్తిడి వంటివి తగ్గుతాయి.

పాడైన జీవకణాలను ఉతేజపరిచేలా చేస్తుంది. కాబట్టి ఈ వర్షాకాలంలో మామూలు టీ కంటే యాలకుల టీ తాగడం వలన మన ఆరోగ్యానికి మంచిది. టీ పెట్టుకోవడానికి యాలకుల పొడి బయట దొరుకుతుంది. లేదంటే యాలకులతో మనమే పొడిగా చేసుకొని దానిని టీపొడిలో కలిపి పెట్టుకోవచ్చు.

 

Also Read : Jaggery Water: ప్రతిరోజు ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?