Bottle Gourd : సొరకాయ ఎంత చలవ చేస్తుందో తెలుసా? అదే కాదు.. మరిన్ని ప్రయోజనాలు..

సొరకాయ(Bottle Gourd) అంటే కొంత మంది ఇష్టంగా తినరు కానీ సొరకాయ(Sorakaya) తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. సొరకాయలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - June 3, 2023 / 10:00 PM IST

సొరకాయ(Bottle Gourd) అంటే కొంత మంది ఇష్టంగా తినరు కానీ సొరకాయ(Sorakaya) తినడం వలన మన ఆరోగ్యానికి చాలా మంచిది. సొరకాయలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. సొరకాయలో విటమిన్ సి, పాస్ఫరస్, పీచు పదార్ధం, ఇనుము, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. సొరకాయతో కూర, పులుసు, సాంబార్, పచ్చడి, జ్యూస్, హల్వా, అప్పాలు.. వంటివి తయారు చేసుకొని తింటాము.

* సొరకాయలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది.
* సొరకాయను ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన రక్తంలో చక్కర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
* సొరకాయ జ్యూస్ ఒక గ్లాస్ తాగడం వలన మనకు ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉంటుంది.
* సొరకాయ జ్యూస్ తాగితే అది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
* సొరకాయను ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన లివర్ లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే అవి తగ్గడానికి సహాయపడుతుంది.
* సొరకాయ జ్యూస్ లో కొద్దిగా ఉప్పు వేసుకొని మూడు రోజులు తాగితే మనకు కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్లు ఉంటే తగ్గుతాయి.
* సొరకాయను ఆహారంలో భాగంగా తీసుకుంటే మనకు కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుతాయి.
* నిద్రలేమితో బాధపడేవారు సొరకాయ జ్యూస్ తాగితే డిన్నర్ తరువాత అప్పుడు నిద్ర తొందరగా పడుతుంది.
* సొరకాయలో పీచుపదార్థం ఎక్కువగా ఉండడం వలన మలబద్దకం, మొలలు వంటి సమస్యలు తగ్గుతాయి.
* సొరకాయ జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం వలన మూత్రనాళాలలో మంట, యూరిన్ ఇన్ఫెక్షన్లు వంటివి తగ్గుతాయి.
* ఎండాకాలంలో సొరకాయతో చేసిన వంటలు తినడం వల్ల శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.

 

Also Read : Cooling Drinks : ఎండాకాలంలో కూలింగ్‌వి తాగుతున్నారా? అయితే జాగ్రత్త..