బబుల్ గమ్స్(Bubble Gum) ని చిన్నపిల్లలు, పెద్దవారు అని తేడా లేకుండా అందరూ వాటిని తింటూ ఉంటారు. అయితే వాటిని మనం తినడం వలన ప్రయోజనాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. బబుల్ గమ్ తినడం వలన మన నోటి దుర్వాసన పోతుంది. దంతాలు శుభ్రంగా ఉంటాయి. మన లోని ఒత్తిడి తగ్గుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ముఖానికి మంచి ఎక్సర్ సైజ్ లాగా పనిచేస్తుంది.
అయితే బబుల్ గమ్స్ ని ఎక్కువగా తింటే ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. మనం తింటున్నప్పుడు మన మెదడుకు ఆహారం జీర్ణం అవ్వడానికి ఎంజైములను పంపాలని సంకేతాలు పంపుతుంది. కానీ ఎప్పుడూ బబుల్ గమ్ తినేవారిలో వారి మెదడుకు ఎంజైములు విడుదల చేయాలని సంకేతాలను పంపుతుంది. కాబట్టి వారు నిజంగా ఆహారం తినే సమయంలో ఎంజైములను విడుదల చేయదు. అందువలన జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. బబుల్ గమ్స్ ని ఎప్పుడు తినడం వలన వారికి కూరగాయలు, పండ్లు వంటి పోషకాహారాన్ని తినడానికి ఇష్టపడరు. చాకోలెట్స్, చిప్స్ వంటి జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. దానివల్ల ఆరోగ్య సమస్యలు, ఊబకాయం లాంటి సమస్యలు వస్తాయి.
పిల్లలు బబుల్ గమ్ ఎక్కువగా తింటే మైగ్రేన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బబుల్ గమ్స్ తినడం వలన దంతాల వెనుక ఎముకలపై ఒత్తిడి పడి చెవి నొప్పి వస్తుంది. బబుల్ గమ్స్ తినడం వలన మన రక్తంలో చక్కర స్థాయిలు పెరుగుతాయి. షుగర్ పేషంట్స్ బబుల్ గమ్స్ అస్సలు తినకూడదు. కాబట్టి బబుల్ గమ్స్ ని తినాలి అనుకుంటే రోజుకు ఒకటి లేదా రెండు తింటే మంచిది అంతకంటే ఎక్కువ తింటే మన ఆరోగ్యానికి మంచిది కాదు.
Also Read : Salt Benefits: ఏ ఉప్పు ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో మీకు తెలుసా