Site icon HashtagU Telugu

Back Pain: నడుము నొప్పి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ విటమిన్ల లోపమే!

Back Pain

Back Pain

Back Pain: గతంలో నడుము నొప్పిని (Back Pain) కేవలం వృద్ధుల సమస్యగానే భావించేవారు. కానీ నేటి జీవనశైలి, పోషక లోపాల కారణంగా ఈ సమస్య యువతలో కూడా వేగంగా పెరుగుతోంది. ఆఫీసులో గంటల తరబడి కూర్చోవడం, మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ల అధిక వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం, ముఖ్యంగా శరీరంలో కొన్ని ముఖ్యమైన విటమిన్ల లోపం నడుము నొప్పికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. యువతలో నడుము నొప్పికి ఒక ముఖ్యమైన కారణంగా తరచుగా విస్మరించబడుతున్న ఒక విటమిన్ లోపం ఉంది. ఈ కథనంలో మనం రెండు ప్రత్యేక విటమిన్ల గురించి వివరంగా చర్చించి, వాటి లోపం నడుము నొప్పికి లేదా వెన్నెముక నరాలు ఒత్తిడికి గురి కావడానికి ఎలా దారితీస్తుందో? దానిని ఎలా నియంత్రించవచ్చో తెలుసుకుందాం.

విటమిన్ D: ఎముకలు- కండరాలకు నిజమైన మిత్రుడు

విటమిన్ D ని తరచుగా “సన్‌షైన్ విటమిన్” అని పిలుస్తారు. ఎందుకంటే ఇది సూర్యరశ్మికి ప్రతిస్పందనగా మన చర్మం ద్వారా ఉత్పత్తి అవుతుంది. శరీరం కాల్షియంను గ్రహించడానికి ఈ విటమిన్ చాలా అవసరం. శరీరంలో విటమిన్ D లోపించినప్పుడు ఎముకలు బలహీనపడతాయి. కండరాలు పట్టేయడం లేదా వాపుకు గురవుతాయి. దీని వలన నడుము నొప్పి వంటి సమస్యలు వస్తాయి.

విటమిన్ D లోపం ఎలా వస్తుంది?

నేటి డిజిటల్, ఇండోర్ జీవనశైలి మన ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేసింది. మనం బయట తక్కువ సమయం గడుపుతున్నాం. దీని అర్థం మన శరీరానికి సహజంగా అవసరమైన విటమిన్ D అందడం లేదు. దీనికి తోడు మన ఆహారపు అలవాట్లు కూడా విటమిన్ D పరిమాణాన్ని తగ్గిస్తున్నాయి.

విటమిన్ D లోపానికి ప్రధాన కారణాలు

విటమిన్ D లోపానికి- నడుము నొప్పికి మధ్య సంబంధం

శరీరంలో విటమిన్ D స్థాయిలు తగ్గినప్పుడు అది కాల్షియం శోషణపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా ఎముకలు బలహీనపడతాయి. దీని వలన నడుము నొప్పి, వాపు లేదా కండరాల పట్టేయడం మొదలవుతాయి. క్రమంగా ఈ నొప్పి దీర్ఘకాలికంగా మారవచ్చు. యువ వయస్సులోనే నడుము నొప్పి ఫిర్యాదులు మొదలవుతాయి.

విటమిన్ B12.. నరాల ఆరోగ్యానికి అత్యవసరం

విటమిన్ B12 మన శరీరంలోని నరాల ఆరోగ్యం, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి చాలా అవసరం. దీని లోపం వలన నరాల చుట్టూ ఉండే పొర (మైలిన్ షీత్) బలహీనపడుతుంది. తద్వారా నరాలపై ఒత్తిడి పెరిగి చేతులు, కాళ్ళలో తిమ్మిర్లు, మంట లేదా బలహీనత కలుగుతాయి. ఈ లోపం ఎక్కువ కాలం కొనసాగితే అది వెన్నెముక దిగువ భాగంలో ముఖ్యంగా L4, L5 డిస్కులపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల నరాలు ఒత్తిడికి గురై నడుము నొప్పి, కాళ్ళలో నొప్పి లేదా నడవడానికి ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. అందుకే విటమిన్ B12ను క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

విటమిన్ B12 లోపం ఎలా వస్తుంది?

ఆహారంలో తగినంత విటమిన్ B12 తీసుకోనప్పుడు లేదా శరీరం దానిని సరిగ్గా శోషించుకోలేనప్పుడు ఈ లోపం సంభవిస్తుంది. ఈ లోపం ముఖ్యంగా శాకాహారులలో, కడుపు సమస్యలు (గ్యాస్ట్రైటిస్ వంటివి), వృద్ధాప్యంలో సాధారణం. దీర్ఘకాలికంగా ఈ లోపం ఉంటే నరాలు, మెదడుపై ప్రభావం పడుతుంది. అదనంగా ఎక్కువ మద్యం సేవించే వారిలో కూడా విటమిన్ B12 లోపం ఉంటుంది.

Also Read: Toyota: మార్కెట్లోకి 15 కొత్త మోడళ్లను విడుదల చేయనున్న టయోటా!

విటమిన్ B12 లోపాన్ని ఎలా దూరం చేయాలి

విటమిన్ D లోపాన్ని ఎలా దూరం చేయాలి?

Exit mobile version