Baby Skin Care Tips: మీ పిల్లల చర్మ సంరక్షణ కోసం మీరేం చేస్తున్నారు..?

చిన్న పిల్లలకు కొంచెం అదనపు జాగ్రత్త (Baby Skin Care Tips) అవసరం. ఎందుకంటే వారి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది.

  • Written By:
  • Updated On - December 5, 2023 / 07:13 AM IST

Baby Skin Care Tips: తల్లిదండ్రులు అవ్వడం వల్ల సంతోషంతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. బాబు లేదా పాప మొదటి ఏడుపు, ఒడిలో ఎత్తుకోవడం, సున్నితమైన అవయవాలను పట్టుకోవడం.. ఇవన్నీ భిన్నమైన అనుభూతిని కలిగిస్తాయి. చిన్న పిల్లలకు కొంచెం అదనపు జాగ్రత్త (Baby Skin Care Tips) అవసరం. ఎందుకంటే వారి చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో ప్రకటనలు చూసి వారి కోసం స్కిన్ ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా వారి చర్మానికి ఏది మంచిదో తెలుసుకుని, ఆ తర్వాత వాటిని కొనుగోలు చేయండి. పిల్లల చర్మ సంరక్షణకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

పిల్లల చర్మం పెద్దవారి కంటే చాలా సున్నితంగా ఉంటుంది. దీని కారణంగా కాలుష్యం, వాతావరణం, ఇతర విషయాల వల్ల సులభంగా ప్రభావితమవుతుంది. ఈ పరిస్థితిలో వారి చర్మం కోసం రసాయనాలు లేని సహజ పదార్థాలతో తయారు చేయబడిన ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వండి.

నవజాత శిశువుల చుట్టూ పరిశుభ్రత ముఖ్యం. వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అంటువ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే శిశువుకి వారానికి 2,3 సార్లు చేయిస్తే వాళ్ళ చర్మం శుభ్రంగా ఉంటుంది. అలాగే మీరు పిల్లల్ని ఎత్తుకునే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి.

Also Read: Cyclone Michaung: తుపాను ముంచుకొస్తోంది..ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి: పవన్ కళ్యాణ్

శిశువు చర్మం సాధారణంగా పొడిగా ఉంటుంది. గర్భం లోపల వాతావరణానికి అలవాటు పడి బయటకు రాగానే ఉన్న వాతావరణాన్ని తట్టుకోవడం కష్టం. శిశువు చర్మం పొడిబారకుండా ఉండాలంటే వారి కళ్ళకు చికాకు కలిగించకుండా ఉండే సబ్బు ఉపయోగించడం చాలా అవసరం. స్నానం చేసిన తర్వాత శరీరం అంతటా లోషన్ పూయాలి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచుతాయి.

నవజాత శిశువుల్లో దద్దుర్లు చాలా సాధారణం. అవి తగ్గిపోవడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఎర్రబడటం మచ్చలు ఏర్పడం కూడా కొన్ని సార్లు జరుగుతుంది. శిశువు చర్మంపై మొటిమల వంటి దద్దుర్లు, చర్మం పొట్టు రాలడం వంటివి కనిపిస్తే భయపడొద్దు. ఆ ప్రాంతాన్ని శుభ్రంగా, పొడిగా ఉంచాలి. ఎంతకీ తగ్గకపోతే వైద్యులని సంప్రదించాలి.

పిల్లలు, పెద్దలు హైడ్రేట్ గా ఉంచడం చాలా అవసరం నీరు శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన చర్మాన్ని కూడా ఇస్తుంది. హైడ్రేషన్ గా ఉంటే శరీరంలోని అన్ని విష పదార్థాలు బయటకి పోతాయి. శిశువు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.