Health : కోడి గుడ్డును చాలా మంది కేవలం అల్పాహారం లేక మాంసాహారం తినని వారికి ప్రత్యామ్నాయంగానో చూస్తుంటారు. కొందరైతే బరువు పెరుగుతారని, కొలెస్ట్రాల్ వస్తుందని పూర్తిగా గుడ్లను తినడమే మానేస్తారు. కానీ, గుడ్డును “లైట్” తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు అందకుండా పోతాయని ఎంత మందికి తెలుసు. ఫలితంగా వారానికి ఒకసారి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. గుడ్డు కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, అది ఒక పోషకాల గని అని గుర్తుంచుకోవాలి.
గుడ్డులో ఉండే విటమిన్స్ శరీరానికి ఎంతో అవసరం
గుడ్డులో ముఖ్యంగా ప్రోటీన్స్ అయిన విటమిన్ డి, విటమిన్ బి12, సెలీనియం, కోలిన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ డి లోపం వస్తే అంతే సంగతి. సూర్యరశ్మి ద్వారా లభించే ఈ విటమిన్.. గుడ్డులో కూడా గణనీయంగా లభిస్తుంది. విటమిన్ డి లోపం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ఆస్టియోపొరోసిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పిల్లలలో ఎముకల ఎదుగుదల మందగిస్తుంది. అంతేకాకుండా, ఇది రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది, తద్వారా తరచుగా జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది.
Health : మంచి ఆరోగ్యం కోసం అధికంగా డైట్ పాటిస్తున్నారా? ఇలాంటి పొరపాట్లు చేయకండి!
విటమిన్ డి లోపం వల్ల కేవలం ఎముకల సమస్యలే కాకుండా మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. విటమిన్ డి స్థాయిలు తక్కువగా ఉన్నవారిలో డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గుడ్డును విస్మరించడం వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్ కూడా అందదు. కండరాల నిర్మాణానికి, కణజాల మరమ్మత్తుకు, ఎంజైములు, హార్మోన్ల ఉత్పత్తికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ లోపం వల్ల కండరాలు బలహీనపడటం, శక్తి కోల్పోవడం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటివి జరుగుతాయి.
అంతేకాదు, గుడ్డులో ఉండే విటమిన్ బి12 నరాల ఆరోగ్యానికి, రక్త కణాల ఉత్పత్తికి కీలకం. దీని లోపం వల్ల రక్తహీనత, అలసట, జ్ఞాపకశక్తి లోపం, నరాల సమస్యలు తలెత్తవచ్చు. గుడ్డులో ఉండే కోలిన్ మెదడు పనితీరుకు, ముఖ్యంగా జ్ఞాపకశక్తికి చాలా అవసరం. ఈ పోషకాలన్నీ శరీరానికి సక్రమంగా అందకపోతే, దీర్ఘకాలంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అంతేకాకుండా బాడీలో మెలనోసైట్స్ ఉత్పత్తి చేసే డి విటమిన్.. దొరక్కపోతే మెలనిన్ శాతం తగ్గి జుట్టు కూడా తెల్ల బడుతుంది. ఇక గుడ్డు తింటే కొలెస్ట్రాల్ వస్తుందని ఆందోళన ఉన్నప్పటికీ, చాలా మందికి గుడ్డులోని కొలెస్ట్రాల్ రక్త కొలెస్ట్రాల్‌పై పెద్దగా ప్రభావం చూపదని ఇటీవలి అధ్యయనాలు స్పష్టంచేస్తున్నాయి. అందుకే గుడ్డును మీ ఆహారంలో చేర్చుకోవడం వలన మీరు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Bhatti Vikramarka : భవిష్యత్ తరాలను మరించి ఎనర్జీ పాలసీని తుంగలో తొక్కారు