Summer : వేసవిలో ఈ ఫుడ్ ని కచ్చితంగా దూరం పెట్టండి..

ఎండాకాలంలో ఉండే వేడి వలన, డీ హైడ్రేషన్ వలన కొన్ని ఫుడ్స్ కి దూరంగా ఉండటం మంచిది.

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 06:00 PM IST

Summer : ఎండాకాలంలో ఆహరం(Food) విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎండాకాలంలో ఉండే వేడి వలన, డీ హైడ్రేషన్ వలన కొన్ని ఫుడ్స్ కి దూరంగా ఉండటం మంచిది. ఎండాకాలంలో మన శరీరంలోని నీరు తొందరగా ఆవిరి అవుతుంది కాబట్టి మనకు ఎక్కువగా దాహం వేస్తుంటుంది. ఆయిల్ ఫుడ్స్ తింటే ఇంకా ఎక్కువ దాహం వేస్తుంది కాబట్టి ఎండాకాలంలో ఆయిల్ ఫుడ్స్ తినకూడదు. నూనెలో వేయించిన పదార్థాలు, బజ్జీలు, పునుకులు, పకోడీలు వంటి వాటికి ఎక్కువగా దూరంగా ఉండాలి.

సమ్మర్ లో స్పైసి ఫుడ్స్, మసాలాలు, నాన్ వెజ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. సమ్మర్ లో నాన్ వెజ్ తొందరగా జీర్ణం అవ్వదు. కాబట్టి మనం సమ్మర్ లో నాన్ వెజ్ కి వీలైనంతవరకు దూరంగా ఉండాలి. స్పైసి ఫుడ్, మసాలాలు తినడం వలన మన పొట్టలో వేడి ఎక్కువ అవుతుంది. ఇంకా మనకు జీర్ణక్రియలో సమస్యలు వస్తాయి.

అలాగే సమ్మర్ లో టీ, కాఫీ వంటి పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి ఎందుకంటే వీటిని ఎండాకాలంలో ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన డైజెషన్ సమస్యలు ఎక్కువగా వస్తాయి.

సమ్మర్ లో చల్లని కూల్ డ్రింక్స్ వంటివి తాగాలని అనిపిస్తుంది. కానీ అవి తాగాలి అనుకున్నప్పుడు మార్కెట్ లో దొరికినవి కాకుండా మన ఇంటిలో చేసుకుంటే మంచిది. లేదా మజ్జిగ, జ్యుస్ లాంటివి తాగాలి. అది కూడా కూలింగ్ తక్కువ ఉన్నవి తాగాలి.

ఎండాకాలంలో ఆల్కహాల్ తాగడం వలన మన శరీరం డీ హైడ్రేట్ కి గురవుతుంది కాబట్టి ఆల్కహాల్ తాగేవారు ఎండాకాలంలో దానికి దూరంగా ఉండాలి. పొగ తాగేవారు కూడా దానికి దూరంగా ఉండాలి లేకపోతే మన శరీరంలో వేడి, బి పి పెరుగుతాయి. ఎండాకాలంలో ముఖ్యగా స్పైసి ఫుడ్స్, నాన్ వెజ్, ఆయిల్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, పొగ తాగడం వంటి వాటికి దూరంగా ఉంటె ఆరోగ్యానికి మంచిది.

 

Also Read : Peanut Chikki : షాప్స్ లో అమ్మే పల్లిపట్టి.. ఇంట్లో రుచిగా ఎలా చేయాలంటే..? పల్లిపట్టి ప్రయోజనాలు..