Site icon HashtagU Telugu

Curd Rice: పెరుగు ఏ సమయంలో తింటే ఆరోగ్యానికి మంచిది?

Curd Rice Benefits

Curd Rice

మన ఆరోగ్యానికి అన్ని పోషకాలూ అవసరం. ఎందుకంటే విటమిన్లు (Vitamins), ప్రోటీన్లు (Proteins), కార్బోహైడ్రేట్లు (Carbohydrates) మన శరీరాన్ని సమతుల్యం చేస్తాయి. అందుకు రోజువారీ ఆహారంలో పప్పులు, పచ్చి కూరలు (Green Vegetables) తినాలి. అలాగే పెరుగు (Curd)లో అనేక పోషకాలు కూడా ఉన్నాయి. కానీ పెరుగు (Curd Rice) తినడానికి సరైన సమయం (Time) ఉంది. పెరుగు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరానికి పెరుగు చాలా అవసరం. ఇందులో రకరకాల పోషకాలు ఉంటాయి. పెరుగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ప్రోటీన్లు (Proteins), విటమిన్ బి-6, బి-12, కాల్షియం (Calcium) పుష్కలంగా ఉంటాయి. గ్యాస్ సంబంధిత సమస్యల నుంచి పెరుగు ఉపశమనం కలిగిస్తుంది.

పెరుగు శరీర PH స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. దంతాలు (Teeth), గోర్లు (Nails), ఎముకల (Bones) ఆరోగ్యాన్ని కాపాడటంలో పెరుగు (Curd Rice) ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సరైన సమయం (Time)లో తిన్నప్పుడే ఈ ప్రయోజనాలు కలుగుతాయి. పరిశోధనల ప్రకారం మీరు భోజనం (Rice) తర్వాత కంటే భోజనానికి ముందు పెరుగు తినడం మంచిది. భోజనానికి ముందు పెరుగు తినే స్త్రీలలో పేగు మంట తక్కువగా ఉండటమే కాకుండా జీర్ణశక్తి మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. భోజనానికి ముందు పెరుగు తినడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకంతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. ఐతే సాయంత్రం (Evening Time) 5 గంటల తర్వాత లేదా రాత్రిపూట (Night Time) పెరుగు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

Also Read:  Coconut Water for Diabetes: కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి?

పెరుగులో కూలింగ్ గుణాలు ఉన్నాయి. కాబట్టి చలికాలంలో ఎండుమిర్చి లేదా వేయించిన జీలకర్ర పొడి వంటి మసాలా దినుసులు, తేనె కలిపి తింటే ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో పెరుగు (Curd Rice) తినడం మంచిది కాదని కొందరు అంటున్నారు. కానీ మన శరీరానికి అన్ని పోషకాలూ కావాలి. ఎందుకంటే విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు మన శరీరాన్ని సమతుల్యం చేస్తాయి. పెరుగు (Curd Rice) కూడా ఇలా చేస్తుంది. పెరుగును వేడి అన్నం (Rice)తో తినకూడదు. పెరుగును వేడి పదార్థాలతో కలిపితే మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. భోజనం తర్వాత పెరుగు తప్పనిసరిగా తినాలి అనుకుంటే దానికి పంచదార (Sugar) కలిపితే మంచిది. మీరు చక్కెరకు బదులుగా తేనె (Honey) లేదా బెల్లం (Jaggery) కూడా ఉపయోగించవచ్చు.