Site icon HashtagU Telugu

Sweet Cancer : “తియ్యటి” గండం..పట్టణాల్లో అతిగా కృత్రిమ స్వీటెనర్ల వినియోగం

Sweet Cancer

Sweet Cancer

Sweet Cancer : కృత్రిమ స్వీటెనర్లు ఉండే ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారా ?

అయితే తస్మాత్ జాగ్రత్త .. 

కనీసం ఇక నుంచి అయినా వాటి వినియోగాన్ని బాగా తగ్గించండి అని ఇటీవల  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వార్నింగ్ ఇచ్చింది. 

కృత్రిమ స్వీటెనర్ల అతి వినియోగం క్యాన్సర్ కారకంగా మారొచ్చని తెలిపింది. 

ఈనేపథ్యంలో లోకల్ సర్కిల్స్ (Local Circles) అనే సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆందోళన కలిగించే అంశాలు వెల్లడయ్యాయి.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

Also read : SBI: ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులకు షాక్.. మరింత భారం కానున్న ఈఎంఐలు..!

కృత్రిమ స్వీటెనర్లు అనేవి మామూలు చక్కెర కంటే దాదాపు 600 రెట్లు ఎక్కువ తియ్యగా ఉంటాయి. ఇవి క్లోరినేటెడ్ చక్కెరలు. వాస్తవానికి మనం వాడే సాధారణ చక్కెర ను వివిధ విడతల్లో ప్రాసెస్ చేసి.. దానిలోని 3 హైడ్రాక్సిల్ అణువుల సమూహాన్ని 3 క్లోరిన్ అణువులతో భర్తీ  చేస్తే  “సుక్రలోజ్” అనే  కృత్రిమ స్వీటెనర్ రెడీ అవుతుంది. ఇందులో క్యాలరీలు ఉండవు. కానీ తీపి గుణం 600 రెట్లు పెరుగుతుంది.  ఈ “సుక్రలోజ్” నుంచే రకరకాల కృత్రిమ స్వీటెనర్లను తయారు చేస్తుంటారు. వీటిని తినే సోడా, కూల్ డ్రింక్స్, డ్రై డెజర్ట్‌లు, ఫ్రై చేసిన ఫుడ్స్, షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్‌, షుగర్‌ఫ్రీ చాక్లెట్‌లు, ఐస్‌క్రీమ్‌లు, ఎనర్జీ డ్రింక్స్ లలో ఉపయోగిస్తుంటారు.

Also read : Chandrayaan-3 Journey Pictures : చంద్రయాన్ 3పై అమర్చిన కెమెరా పంపిన ఫోటోలు చూశారా !

లోకల్ సర్కిల్స్ సర్వేలో తేలిన విషయాలు 

Also read : Razakar: తెలంగాణ పల్లెలపై జరిగిన ద‌మ‌న‌కాండ నేప‌థ్యంలో ‘రజాకర్’ మూవీ

ASPARTAME డేంజర్ బెల్స్  

ఆస్పార్టమే (ASPARTAME) అనే స్వీటెనర్.. మన  చక్కెర కంటే 200 రెట్లు తియ్యగా ఉంటుంది. ఇది తెలుపు రంగులో, వాసన లేని పొడి రూపంలో ఉంటుంది. ప్రపంచంలో అత్యధికంగా వినియోగంలో ఉన్న స్వీటెనర్ ఇది. ఒక కిలోగ్రాము శరీర బరువుకు..  50 మిల్లీగ్రాముల చొప్పున మాత్రమే రోజువారీగా ఆస్పార్టమే  తీసుకోవాలని అంటారు. డైట్ కోక్, కోకా-కోలా అనేవి ఆస్పార్టమే ను కలిగి ఉన్న ప్రసిద్ధ శీతల పానీయాలు. “ఆస్పార్టమే అతి వినియోగం వల్ల క్యాన్సర్ ముప్పు ఉంటుంది. కానీ తగిన మోతాదులో తక్కువగా వాడటం  సురక్షితమే” అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కి చెందిన నిపుణుల రెండు బృందాలు శుక్రవారం రోజున(జులై 14న)  ప్రకటించాయి.